కైరా అద్వానీ 'బ్యూటీ' సీక్రెట్‌ ఏంటో తెలుసా?

మరిన్ని వార్తలు

ఫిజిక్‌ని కరెక్ట్‌గా ఉంచుకునేందుకు ముద్దుగుమ్మలు పడే పాట్లు అన్నీ ఇన్నీ కావు. డైట్‌ కంట్రోల్‌ దగ్గర్నుంచీ, జిమ్‌లో చేసే వర్కవుట్స్‌ దాకా ఒక్కటేమిటీ.. పాపం ఆ ఫిజిక్‌ని మెయింటైన్‌ చేసేందుకు చాలానే త్యాగాలు చేయాల్సి వస్తుంది. కానీ, ముద్దుగుమ్మ కైరా అద్వానీ అవేమీ చేయదట. కానీ ఉండాల్సిన హైటూ, వెయిటూ, గ్లామర్‌ అన్నీ పుష్కలంగా ఉంటాయి ఈ ముద్దుగుమ్మలో. అయితే, ఏమీ చేయకుండా అంత ఫిట్‌గా ఉండడం ఇంపాజిబుల్‌ అంటారా.? అవునండీ నిజంగా ఇది నిజమేనట. స్వయంగా కైరా అద్వానీనే చెప్పాక నమ్మక తప్పుతుందా.. చెప్పండి.

 

అయితే, కైరా ఫిగర్‌ ఎందుకు అంత కంట్రోల్‌లో ఉంటుందా అంటే, రోజులో ఒక గంట తప్పనిసరిగా డాన్స్‌ ప్రాక్టీస్‌ చేస్తుందట. అది కూడా కథక్‌ డాన్స్‌. చిన్నతనం నుండీ ఈ భామ కథక్‌ డాన్స్‌లో శిక్షణ తీసుకుందట. వయసుతో పాటే, కథక్‌ డాన్సులో మెలకువలు తెలుసుకోవడంలోనూ కైరా పరిణీతి చెందిందట. అలా అది తన లైఫ్‌ స్టైల్‌లో ఓ భాగమైపోయిందనీ, అదే తనను అంత ఫిట్‌గా ఉంచేందుకు సహకరింస్తోందనీ, రోజులో ఒక్క గంట డాన్స్‌ చేస్తే, అది జిమ్‌లో గంటల తరబడి కష్టపడి చేసే ఎన్నో వర్కవుట్స్‌కి సమానమనీ చెబుతోంది అందాల కైరా.

 

ప్రస్తుతం కైరా అద్వానీ బాలీవుడ్‌లో బిజీగా గడుపుతోంది. అక్షయ్‌కుమార్‌తో 'గుడ్‌న్యూస్‌' చిత్రంలో నటిస్తోంది. షాహిద్‌కపూర్‌తో నటించిన 'కబీర్‌సింగ్‌' విడుదలకు సిద్ధమైంది. మరో రెండు ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నాయట. తెలుగులోనూ ఈ భామ చాలా కథలు వింటోందట. త్వరలోనే ఓ బిగ్‌ ప్రాజెక్ట్‌కి సైన్‌ చేయనుందనీ తెలుస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS