'కబీర్‌సింగ్‌'పై కియరా సంచలన వ్యాఖ్యలు!

మరిన్ని వార్తలు

బాలీవుడ్‌లో 'కబీర్‌సింగ్‌' సంచలన విజయం సాధించి 300 కోట్లు వసూళ్లు కొల్లగొట్టిన సంగతి తెలిసిందే. 'కబీర్‌సింగ్‌' ఏ స్థాయిలో విజయం సాధించిందో. అంతకన్నా ఎక్కువ స్థాయిలోనే విమర్శలు, వివాదాల్ని కూడా నెత్తిన మోసింది. అన్నింటికీ మించి, ముఖ్యంగా ప్రేమలో కొట్టుకునేంత చనువు ఉండాలని దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా చెప్పిన మాట ఎంతగా వివాదాస్పదమైందో, ఎన్ని రకాల చక్కర్లు కొట్టిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాజాగా ఇదే విషయమై, హీరోయిన్‌ కైరా అద్వానీ కూడా స్పందించాల్సి వచ్చింది.

 

తాను ఖచ్చితంగా ప్రేమించిన వ్యక్తినే పెళ్లి చేసుకుంటానని, అయితే, మా ప్రేమలో కొట్టుకోవడాలుండవనీ చెప్పింది. 'కబీర్‌సింగ్‌' గురించి ప్రస్థావిస్తూ, సినిమా వేరు. రియల్‌ లైఫ్‌ వేరు. లవర్‌ అయినా, హజ్‌బెండ్‌ అయినా, ఏ కారణం చేతనైనా సరే, నా ఒంటి మీద చేయి వేయనివ్వనని కైరా చేసిన వ్యాఖ్యలు తాజగా సంచలనమయ్యాయి. ప్రస్తుతం కైరా అద్వానీ హిందీలో వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంది.

 

అక్షయ్‌ కుమార్‌తో రెండు సినిమాల్లో నటిస్తున్న కైరా మరో రెండు బిగ్‌ ప్రాజెక్టులు లైన్‌లో ఉన్నాయి. అంతే కాదు, బాలీవుడ్‌లో ఇప్పుడు కైరా మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌ అయిపోయింది. యంగ్‌ హీరోలూ, స్టార్‌ హీరోలు సైతం, కైరా కోసమే వెయిటింగ్‌ లిస్టులో ఉన్నారంటే అతిశయోక్తి కాదేమో. ఆ రేంజ్‌లో కైరా అక్కడ బిజీ అయిపోయింది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS