ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ఓ చిత్రం రూపుదిద్దుకోనున్న సంగతి తెలిసిందే. `ఆర్.ఆర్.ఆర్` తరవాత..ఎన్టీఆర్ చేయబోయే సినిమా ఇదే. స్క్రిప్టు ఇప్పటికే లాక్ అయిపోయింది. మార్చి నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉంది. ఈ సినిమాలో నటించే కథానాయిక గురించి చాలా రోజులుగా చర్చ జరుగుతోంది. ముందు.... పూజా హెగ్డేని అనుకున్నారు. ఆ తరవాత.. కీర్తి సురేష్ పేరు వినవచ్చింది.
ఇప్పుడు మరో కొత్త పేరు బయటకు వచ్చింది. తనే... కియారా అద్వాణీ. భరత్ అనే నేను, వినయ విధేయ రామా సినిమాలతో ఆకట్టుకుంది కియారా. బాలీవుడ్ లో ఫుల్ బిజీ హీరోయిన్. వెబ్ సిరీస్‌లూ చేసింది. ఇప్పుడు మళ్లీ టాలీవుడ్ నుంచి పిలుపు వచ్చినట్టు టాక్. ఎన్టీఆర్ పక్కన కొత్త కథాయిక అయితే బాగుంటుందని త్రివిక్రమ్ భావిస్తున్నాడట. అందుకే.. పూజా హెగ్డేని పక్కన పెట్టి.. కియారాకి ఛాన్స్ ఇచ్చినట్టు తెలుస్తోంది.