చ‌ర‌ణ్ కోసం... కియారా వ‌చ్చింద‌య్యా!

By iQlikMovies - July 31, 2021 - 12:05 PM IST

మరిన్ని వార్తలు

రామ్ చ‌ర‌ణ్ - శంక‌ర్ కాంబినేష‌న్ లో ఓ చిత్రం రూపుదిద్దుకుంటున్న సంగ‌తి తెలిసిందే. దిల్ రాజు నిర్మాత‌. ఈ సినిమాలో క‌థానాయిక‌గా కియారా న‌టిస్తుంద‌ని ముందు నుంచీ ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇప్పుడు అదే నిజ‌మైంది. ఈ సినిమాలో కియారా ఖాయ‌మైంది. ఈ విష‌యాన్ని కియారానే స్వ‌యంగా వెల్ల‌డించింది. అంతేకాదు.. శంక‌ర్‌తో ఉన్న ఓ ఫొటోని కూడా అభిమానుల‌కు షేర్ చేసింది. చ‌ర‌ణ్ - కియారా క‌లిసి న‌టించ‌డం ఇదే కొత్త కాదు. ఇది వ‌ర‌కు `విన‌య విధేయ రామా`లో ఓసారి ఈ జంట క‌నువిందు చేసింది.

 

ఈ సినిమా ఫ్లాప్ అయినా... వీరిద్ద‌రి మ‌ధ్య కెమిస్ట్రీ అదిరింది. అందుకే మ‌రోసారి కియారాని ఖాయం చేశారు. ప్ర‌స్తుతం `ఆచార్య‌` షూటింగ్ లో బిజీగా ఉన్నాడు చ‌ర‌ణ్‌. త‌న షెడ్యూల్ పూర్త‌యిన వెంట‌నే శంక‌ర్ సినిమాలో జాయిన్ అవుతాడు. ఆగ‌స్టు రెండో వారం నుంచి శంక‌ర్ సినిమా మొద‌ల‌వుతుంది. తొలిగా చ‌ర‌ణ్ - కియారాల‌పై ఓ పాట‌ని తెర‌కెక్కిస్తారు. అందుకోసం త‌మ‌న్ ఇప్ప‌టికే అదిరిపోయే ట్యూన్ సిద్ధం చేసేశాడు. ఈ సినిమాలో చ‌ర‌ణ్ పాత్ర‌లో రెండు కోణాలుంటాయ‌ని, పొలిటిక‌ల్ థ్రిల‌ర్ గా ఈ సినిమా సాగ‌బోతోంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. దీనిపైచిత్ర‌బృందం స్ప‌ష్ట‌త ఇవ్వాల్సివుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS