మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం కోసం మేకోవర్ అవుతున్నారు. ఆయన లుక్స్, ఫిజిక్‌లో చాలా డిఫరెన్స్ వచ్చింది. ఈ మధ్య అక్కడక్కడా బహిరంగ వేడుకలపై కనిపిస్తూ ఫ్యాన్స్‌ని మెస్మరైజ్ చేస్తున్నారు. యంగ్ హీరోలకు ధీటైన హ్యాండ్‌సమ్ లుక్స్‌తో కిర్రాక్ పుట్టిస్తున్నారు. రీ ఎంట్రీలో వచ్చిన ఫస్ట్ మూవీ 'ఖైదీ'లో మేకప్ విషయంలో చిన్నా చితకా తప్పులు కనిపించాయి. తర్వాత వచ్చిన 'సైరా నరసింహారెడ్డి' హిస్టారికల్ మూవీ కాబట్టి, మేకప్ అద్భుతహ అనే ప్రశంసలే వచ్చాయి. కానీ, ఈ సినిమాలో చిరంజీవి ట్రెండీ లుక్స్‌లో కనిపించనున్నారు. అందుకోసం ముంబయ్ నుండి వచ్చిన స్పెషల్ మేకప్ టీమ్ చిరంజీవి లుక్ టెస్ట్‌లో భాగం పంచుకుంటోందట.
ఇప్పటికే లుక్ టెస్ట్ కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా త్రిష నటిస్తోంది. జనవరి 3 నుండి రెగ్యులర్ షూట్ స్టార్ట్ కానుంది. తొలి షాట్‌లో హీరో, హీరోయిన్‌పై పాట చిత్రీకరణ జరగనుందని మొదట్నుంచీ ప్రచారం జరుగుతోంది. మెసేజ్ ఓరియెంటెడ్ కమర్షియల్ ఫిలింగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని నిరంజన్ రెడ్డితో కలిసి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు.