‘గిల్టీ’గా కియరా రేప్‌ ట్రైలర్‌.!

మరిన్ని వార్తలు

‘లస్ట్‌ స్టోరీస్‌’లో బోల్డ్‌ క్యారెక్టర్‌లో కనిపించి కియారా బాలీవుడ్‌ ఆడియన్స్‌ మనసు దోచేసింది. ఓ వెబ్‌ సిరీస్‌ హీరోయిన్‌ కెరీర్‌నే మార్చేసిందంటే, అదే లస్ట్‌ స్టోరీస్‌.. ఆ హీరోయిన్‌ కైరా అద్వానీ అని నిస్సందేహంగా చెప్పేయొచ్చు. తనకు అంత లైఫ్‌ ఇచ్చిన వెబ్‌ సిరీస్‌కి కైరా ఎప్పుడూ రుణపడే ఉండాలనుకుందో ఏమో, ;పెద్ద స్క్రీన్ ఫై మోస్ట్ బిజీగా వున్నా వెబ్ సిరీస్ ని వదల్లేదు. తాజాగా మరో వెబ్‌ సిరీస్‌కి కమిట్‌ అయిపోయింది. ఇది కూడా బోల్డ్‌ అండ్‌ మసాలా కంటెంట్‌తో రూపొందిన వెబ్‌ సిరీసే. త్వరలో నెట్‌ ఫ్లిక్స్‌లో రిలీజ్‌ కానుంది. లేటెస్ట్‌గా ఈ వెబ్‌ సిరీస్‌కి సంబంధించిన ఓ ట్రైలర్‌ వదిలారు. ట్రైలర్‌ ఆధ్యంతం ఆసక్తిగొలిపేలా ఉంది. సస్పెన్స్‌ థ్ల్రిల్లర్‌ అంశాలు ట్రైలర్‌లో చాల వున్నాయ్ ఓ కాలేజ్‌ గాళ్‌, బోయ్‌ ఫ్రెండ్స్‌తో జాలీగా లైఫ్‌ ఎంజాయ్‌ చేస్తూ ఉంటుంది.

సడెన్‌గా ఓ నైట్‌ ఆ ఫ్రెండ్స్‌ గ్యాంగ్‌లో జరిగిన అజడి. కట్‌ చేస్తే ఓ అబ్బాయి రేప్‌ చేయబడతాడు. అమ్మాయిలు, అబ్బాయిలు కలిసి ఎంజాయ్‌ చేసిన పార్టీలో అబ్బాయి రేప్‌కి గురవడం ఏంటీ.? ఇంతకీ అబ్బాయ్ ని రేప్‌ చేసిన అమ్మాయి ఎవరు.? కొంప తీసి కైరా అద్వానీనా.? లేక కైరానే రేప్‌ చేయబడి, స్టోరీని రాంగ్‌ ట్రాక్‌ ఎక్కిస్తుందా.? అనే యాంగిల్‌ నిజంగానే సస్పెన్స్‌గా ఉంది. ‘గిల్టీ’ అనే టైటిల్‌తో రూపొందుతోన్న ఈ వెబ్‌ సిరీస్‌ మార్చి 6న నెట్‌ ఫ్లిక్స్‌లో ప్రీమియర్‌కి సిద్ధమవుతోంది. ఇంతవరకూ రేప్‌ నేపథ్యంలో తెరకెక్కిన క్రైమ్‌ స్టోరీస్‌ చాలా చాలా చూశాం కానీ, ఇదేదో కొత్త యాంగిల్‌ని ప్రొజెక్ట్‌ చేస్తున్నట్లుంది. ఆ న్యూ సస్పెన్స్‌ యాంగిల్‌ ఏంటో తెలియాంటే ‘గిల్టీ’ వెబ్‌ సిరీస్‌ చూడాల్సిందే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS