సినిమా, వెబ్‌ సిరీస్‌.. ఏదైనా, ఆమెకి పండగే.!

మరిన్ని వార్తలు

మామూలుగా వెబ్‌ సిరీస్‌ అంటే కొందరు హడలిపోతారు. అందులో బోల్డ్‌ కంటెంట్‌ వుంటుందనీ, ఓ సారి అటువైపు వెళఙతే సినిమా కెరీర్‌ అటకెక్కిపోతుందన్న అభిప్రాయం కొందరిలో వుండడం సహజమే. కానీ, కైరా అద్వానీ అందుకు భిన్నం. హీరోయిన్‌గా టాప్‌ పొజిషన్‌లో వున్నా, వెబ్‌ సిరీస్‌లను మాత్రం వదలడంలేదు. లేటెస్ట్‌గా ఆమె చేసిన ‘గిల్టీ’ వెబ్‌ సిరీస్‌ సూపర్‌ హిట్‌ అయ్యింది. ఆమె ప్రధాన పాత్రలో రూపొందిన ‘గిల్టీ’ ఇప్పుడు ఇంటర్నెట్‌లో ఓ సంచలనంగా మారింది. ఎంత క్యూట్‌గా కన్పించినా, బోల్డ్‌ రోల్స్‌ చేయడంలో కైరా అద్వానీ రూటే సెపరేటు. ఆ మధ్య ‘లస్ట్‌ స్టోరీస్‌’లో ఆమె చేసిన బోల్డ్‌ క్యారెక్టర్‌ తాలూకు ‘వైబ్రేషన్స్‌’ ఇంకా కొనసాగుతూనే వున్నాయి.

 

ఈ సారి బోల్డ్‌ మాత్రమే కాదు, డైనమిక్‌ రోల్‌లో కైరా అద్వానీ కన్పించింది ‘గిల్టీ’ వెబ్‌ సిరీస్‌లో. ‘గిల్టీ’ సూపర్‌ హిట్‌ అవుతుందని ముందే తెలుసనీ, ఆ నమ్మకంతోనే ఇంకా ఉత్సాహంగా పనిచేశామనీ కైరా అద్వానీ చెప్పుకొచ్చింది. సినిమాకీ, వెబ్‌ సిరీస్‌కీ పెద్దగా తేడా ఏమీ లేదనీ, మేకింగ్‌ కాస్త వేగంగా వెబ్‌ సిరీస్‌ల విషయంలో జరుగుతుందనీ, కష్టం మాత్రం సినిమాకైనా, వెబ్‌సిరీస్‌కి అయినా ఒకటేనని కైరా అద్వానీ అభిప్రాయపడింది. సినిమాలకు ఆదరణ తగ్గదనీ, అదే సమయంలో వెబ్‌ సిరీస్‌లకు మాత్రం ఆదరణ విపరీతంగా పెరుగుతోందనీ, ప్రేక్షకుల్లో వచ్చిన ఈ మార్పుని ప్రతి ఒక్కరూ ఆస్వాదించాలని కైరా అద్వానీ చెప్పింది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS