ఎంత‌కీ తేల్చ‌ని మ‌హేష్‌.. టెన్ష‌న్‌లో ఆ ద‌ర్శ‌కుడు

మరిన్ని వార్తలు

ద‌ర్శ‌కుడు ప‌ర‌శురామ్ ప‌రిస్థితి అడ‌కత్తెర‌లో పోక చెక్క‌లా త‌యారైంది. కొన్నాళ్లుగా ఆయ‌న మ‌హేష్ బాబు వెంట తిర‌గ‌డం, మ‌హేష్ అటు ఇటు తిప్పి, అటు తిప్పి చివ‌రికి ''నో'' చెప్ప‌డంతో - నాగ‌చైత‌న్య‌తో సెటిల్ అయిపోయాడు ప‌ర‌శురామ్‌. చైతూ కోసం క‌థ సిద్ధం చేస్తున్న త‌రుణంలో మ‌ళ్లీ మ‌హేష్ నుంచి పిలుపొచ్చింది. త‌న‌కోసం క‌థ రెడీ చేయ‌మ‌ని చెప్ప‌డంతో చైతూ సినిమాని ఆపేసి, మ‌హేష్ సినిమాపై దృష్టి సారించాడు ప‌ర‌శురామ్‌.

 

ఈ ద‌శ‌లో చైతూ సినిమాని ఆపేయాల్సి వ‌చ్చింది. అయితే.. మ‌హేష్ ఇప్ప‌టికీ ప‌ర‌శురామ్ కి మాట ఇవ్వ‌లేద‌ని తెలుస్తోంది. ''క‌థ పూర్తి స్థాయిలో సిద్దం చేయండి'' అన‌డం త‌ప్ప - మీతోనే సినిమా చేస్తా అని మాట ఇవ్వ‌లేద‌ట‌. దాంతో చైతూ సినిమాని ఆపేయాలో వ‌ద్దో అర్థం కాని విచిత్ర‌మైన స్థితిలో ఉన్నాడు ప‌ర‌శురామ్. మ‌హేష్ కోసం చైతూ సినిమాని ప‌క్క‌న పెట్టేసిన త‌ర‌వాత‌... మ‌హేష్ ఒక‌వేళ `నో`అంటే ప‌రిస్థితి ఏమిటి? అందుకే చైతూ ద‌గ్గ‌ర ''మ‌న సినిమానే చేస్తున్నా'' అని చెప్పుకుంటూ వ‌స్తున్నాడ‌ట ప‌ర‌శురామ్‌. మ‌హేష్ తో సినిమా ప‌ట్టాలెక్కితే.. చైతూకి ఏదో ఒక‌టి చెప్పి త‌ప్పుకుపోవ‌చ్చ‌న్న‌ది ప‌ర‌శురామ్ ప్లాన్‌. కాక‌పోతే అదేమంత సుల‌భం కాదు. ''నా సినిమా చేశాకే మ‌హేష్ తో సినిమా చేసుకోండి'' అని చైతూ అంటే ప‌ర‌శురామ్ ప‌రిస్థితి ఏమిటి? అందుకే ప‌ర‌శురామ్ ఏదీ తేల్చుకోలేక‌పోతున్నాడు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS