'భరత్ అనే నేను' సినిమాతో కుర్రకారు గుండెల్లో వీణలు మోగించేసిన ముద్దుగుమ్మ కైరా అద్వానీ. ఆ తర్వాత 'వీవీఆర్'లో సీతగా మెప్పించి హాట్ హాట్ వలలు విసిరేసింది. బాలీవుడ్ నుండి టాలీవుడ్కొచ్చాక అమ్మడి దశ అమాంతం పెరిగిపోయింది. బాలీవుడ్లో వరుస అవకాశాలు రావడంతో ప్రస్తుతం టాలీవుడ్‌కి షార్ట్ బ్రేక్ ఇచ్చింది. తాజాగా జీసినిమా అవార్డ్స్ 2019 కోసం ఇదిగో ఇలా గోల్డ్ కలర్ హాటెస్ట్ కాస్ట్యూమ్‌లో మెరిసి మతులు పోగొట్టింది.
అసలే దేవదారు శిల్పం కదా.. ఎలా వంచితే అలా వంగుతాయి ఈ ముద్దుగుమ్మ వంపులు. ఇక ఆ మత్తెక్కించే కళ్లతో హాటీ క్లీవేజ్‌తో కైరా అద్వానీ అందాలకు కుర్రకారులో కోరికలు రేసుగుర్రాల్లా పోటీకి దిగుతున్నాయంటే నమ్మి తీరాల్సిందే. బాలీవుడ్లో 'గుడ్‌న్యూస్', అర్జున్‌రెడ్డి రీమేక్ 'కబీర్‌సింగ్' తదితర చిత్రాల్లో నటిస్తున్న కైరా, తెలుగులో ఓ అగ్రహీరో కుటుంబానికి చెందిన యంగ్‌హీరో సినిమాకి కమిట్ అయినట్లు తెలుస్తోంది.