ఉప్పొంగిపోతోన్న 'వసుమతి'

మరిన్ని వార్తలు

ఎవరీ 'వసుమతి' అనుకుంటున్నారా? 'భరత్‌ అనే నేను' సినిమాలోని హీరోయిన్‌ పాత్ర పేరే ఈ 'వసుమతి'. తాజాగా ఈ సినిమా నుండి 'ఓ వసుమతి..' అంటూ సాగే సాంగ్‌ని రిలీజ్‌ చేశారు. హీరోయిన్‌ని పొగుడుతూ హీరో పాడే పాట ఇది. రామజోగయ్య శాస్త్రి రాసిన లిరిక్స్‌ చాలా బాగున్నాయి. హీరో, హీరోయిన్‌ మధ్య సాగే రొమాంటిక్‌ ప్రోమో స్టిల్స్‌ అదరగొట్టేస్తున్నాయ్‌. సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు, బాలీవుడ్‌ బ్యూటీ కైరా అద్వానీ మధ్య రొమాన్స్‌ సూపర్బ్‌గా ఉంది. 

ఇకపోతే, 'తొలిసారిగా నా పేరుతో ఓ పాట వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ పాట నాకు చాలా బాగా నచ్చింది. మీరు కూడా ఎంజాయ్‌ చేస్తారు..' అంటూ హీరోయిన్‌ కైరా అద్వానీ తెగ మురిసిపోతోంది. ఫస్ట్‌ సినిమాకే ఈ ముద్దుగుమ్మ సమ్‌థింగ్‌ ఇంట్రెస్ట్‌ క్రియేట్‌ చేస్తోంది. హుందాగానూ కనిపిస్తోంది. కొన్ని చోట్ల గ్లామరస్‌గా కూడా కనిపిస్తోంది. టోటల్‌గా ఫ్రెష్‌ ఫీచర్స్‌తో తెలుగు ఆడియన్స్‌ మనసులో అప్పుడే స్థానం సంపాదించేసుకుంది. త్వరలోనే తెలుగు కూడా నేర్చుకుంటానని చెప్పడంతో తెలుగు ఆడియన్స్‌కి మరింత దగ్గరైపోయింది. వస్తూ వస్తూనే రెండు సినిమాల్లో ఆఫర్స్‌ దక్కించుకుంది. 

'భరత్‌ అనే నేను' సినిమా తర్వాత చరణ్‌ సినిమాలో నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ. బోయపాటి శీను ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. రావడం రావడమే స్టార్‌ హీరోల సినిమాలతో వస్తోంది. హిట్‌ కొట్టిందా అంతే సంగతి. టాప్‌ హీరోయిన్స్‌ ఛైర్‌ని ఆక్యుపై చేయడానికి ఎంతో టైం పట్టదు ఈ బ్యూటీకి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS