నారా వారబ్బాయ్‌ వచ్చేదెప్పుడంటే.!

By iQlikMovies - April 05, 2018 - 14:17 PM IST

మరిన్ని వార్తలు

విలక్షణ కథలను ఎంచుకునే నారా రోహిత్‌ కూడా ఈ వేసవి సెలవుల్లోనే వచ్చేస్తానంటున్నాడు. నారా రోహిత్‌ తాజా చిత్రం 'ఆటగాళ్లు'. జగపతిబాబు - నారా రోహిత్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు ఈ సినిమాలో. ఇదో డిఫరెంట్‌ కాన్సెప్ట్‌ మూవీ అట. వెరీ సెన్సిబుల్‌ సబ్జెక్ట్‌ అని అంటున్నారు. అయినా నారా రోహిత్‌ ఒప్పుకున్నాడంటేనే అది డిఫరెంట్‌ సబ్జెక్ట్‌గానే భావించాలి. అందరికీ తెలిసిందే, ఆయన కథకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారని. పరుచూరి మురళి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.

నారా రోహిత్‌ ఈ సినిమాలో ఓ స్టన్నింగ్‌ పర్‌ఫామెన్స్‌ ఇవ్వబోతున్నాడట. విలన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా, తండ్రిగా పలు రకాల పాత్రలు పోషించిన జగపతిబాబు ఈ సినిమాలో సరికొత్త పాత్రలో సరికొత్త లుక్‌లో కనిపించబోతున్నారట. తాజాగా ఈ సినిమా షూటింగ్‌ పూర్తి చేసుకుని నిర్మాణానంతర కార్యక్రమాల్లో బిజీగా ఉంది. హిట్‌, ఫెయిల్యూర్‌తో సంబంధం లేకుండా వరుస చిత్రాలు చేసుకుపోయే నారా రోహిత్‌కి ఈ సినిమా ఓ స్పెషల్‌ మూవీ కానుందంటున్నారు.

డిఫరెంట్‌ సబ్జెక్ట్‌తో పాటు, కమర్షియల్‌ హంగులు కూడా జోడించి, చక్కని వినోదాత్మక చిత్రంగా తెరకెక్కించారట. దర్శనా బాసిన్‌ అనే కొత్తమ్మాయి ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయం కాబోతోంది. వేసవి కానుకగా ఈ చిత్రాన్ని అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది చిత్రయూనిట్‌.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS