'భరత్‌' బ్యూటీ కోలీవుడ్‌ ఎంట్రీ.?

మరిన్ని వార్తలు

ఇళయదళపతి విజయ్‌ నటించిన 'తెరి', 'మెర్సల్‌' చిత్రాలు ఆయనకు కెరీర్‌ బెస్ట్‌ విజయాలనందించాయి. ఈ రెండు చిత్రాలను తెరకెక్కించింది యంగ్‌ దర్శకుడు అట్లీ. ఇప్పుడు ముచ్చటగా మూడో సినిమాగా వీరి కాంబినేషన్‌లో మరో సినిమా రాబోతోంది. 

ఈ సినిమా కోసం విజయ్‌కి జోడీగా 'భరత్‌' బ్యూటీని ఎంపిక చేసుకునే యోచనలో విజయ్‌ అండ్‌ టీమ్‌ ఉన్నట్లు కోలీవుడ్‌ సమాచారమ్‌. ఎంట్రీలోనే క్రేజీ అండ్‌ బిగ్‌ ప్రాజెక్టులు అందుకుంటోంది ముద్దుగుమ్మ కైరా అద్వానీ. తెలుగులో ఏకంగా సూపర్‌స్టార్‌ మహేష్‌తో 'భరత్‌ అనే నేను' సినిమాతో గ్రాండ్‌ ఎంట్రీ ఇచ్చింది. ఎంట్రీనే గ్రాండ్‌ కాదు, హిట్‌ కూడా అంతే ఘనంగా కొట్టేసింది. ఆ వెంటనే మెగా కాంపౌండ్‌లో అడుగుపెట్టేసింది. మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌తో ఆన్‌ స్క్రీన్‌ రొమాన్స్‌కి సిద్ధమైంది. బోయపాటి - చరణ్‌ కాంబోలో రూపొందుతోన్న చిత్రంలో కైరా అద్వానీ హీరోయిన్‌ అన్న సంగతి తెలిసిందే. అలాగే ఇప్పుడు కోలీవుడ్‌కి ఎంట్రీ ఇవ్వబోతోందని ప్రచారం జరుగుతోంది. అది కూడా తమిళ స్టార్‌ హీరో విజయ్‌తో. 

అయితే ఈ విషయంలో ఇంకా ఆఫీషియల్‌ క్లారిటీ రాలేదు. కానీ ఒకవేళ వస్తే కోలీవుడ్‌ ఎంట్రీ కూడా ఈ ముద్దుగుమ్మకి ఘనమే అని చెప్పాలి. విజయ్‌ ప్రస్తుతం మురుగదాస్‌ చిత్రంలో నటిస్తున్నాడు. 'సర్కార్‌' టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రం రాజకీయ నేపథ్యంలో రూపొందుతోంది. ఈ చిత్రంలో కీర్తి సురేష్‌ హీరోయిన్‌గా నటిస్తోంది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS