'ప్రేమ' ఫలించింది కానీ, 'పెళ్లి' సంగతో.!

By iQlikMovies - August 10, 2018 - 19:17 PM IST

మరిన్ని వార్తలు

అందాల భామ రాశీఖన్నాకు 'తొలిప్రేమ' సినిమా కెరీర్‌ బెస్ట్‌ హిట్‌ని అందించింది. ఆ సినిమాలో డిఫరెంట్‌ గెటప్‌తో యూత్‌లో బాగా క్రేజ్‌ సంపాదించుకుంది రాశీఖన్నా. అయితే ఆ సరదా ఎంతో కాలం నిలవలేదు. ఆ హిట్‌ ఫార్ములా కంటిన్యూ కాలేదు రాశీఖన్నాకి. 

తాజాగా ముద్దుగుమ్మ రాశీఖన్నా 'శ్రీనివాస కళ్యాణం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వరుణ్‌తో లవ్‌ కలిసొచ్చింది. కానీ నితిన్‌తో మ్యారేజ్‌ కలిసి రాలేదు పాపం రాశీఖన్నాకి. నితిన్‌ హీరోగా దిల్‌రాజు నిర్మాణంలో రూపొందిన చిత్రమిది. ఈ సినిమా, విడుదలకు ముందు పోజిటివ్‌ వైబ్స్‌ క్రియేట్‌ చేసింది. విడుదల తర్వాత సినిమాని పెద్దగా పట్టించుకోలేదెవ్వరూ. అలాగని పూర్తిగా ఫ్లాప్‌ అని కూడా అనలేం. అయితే 'తొలిప్రేమ'లాంటి హిట్‌ అయితే రాశీఖన్నాకి రాలేదు శ్రీనివాస కళ్యాణం' సినిమాతో. 

మిక్స్‌డ్‌ టాక్‌తో రన్‌ అవుతోందంతే. వసూళ్ల పరంగా బాక్సాఫీస్‌ వద్ద పెద్దగా నిలబడే సినిమా కాదని ఓపెనింగ్స్‌ బట్టే తెలిసిపోయింది. దిల్‌రాజు సినిమాలకు ఓవర్సీస్‌లో మంచి క్రేజ్‌ ఉంటుంది. అక్కడ కూడా 'శ్రీనివాస కళ్యాణం' డల్‌ ఓపెనింగ్స్‌నే అందుకుంది. 

మరోవైపు అడవిశేష్‌ హీరోగా తెరకెక్కిన 'గూఢచారి' సినిమా ఆగష్టు 3న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఓవర్సీస్‌లో దుమ్ము రేపేస్తోంది. దాదాపు 3.5 కోట్ల డాలర్లు వసూళ్లు రాబట్టిందక్కడ 'గూఢచారి'. శిశికిరణ్‌ తిక్కా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంతో తెలుగమ్మాయి శోభితా ధూళిపాళ్ల హీరోయిన్‌గా పరిచయమైంది.
 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS