యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం దుబాయ్ లో తన సాహో చిత్ర షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.
ఇప్పటికే ఈ దుబాయ్ లో చిత్రీకరిస్తున్న షెడ్యూల్ కి సుమారు రూ 90కోట్ల వరకు వెచ్చించనున్నట్టు తెలిసి అందరు ఆశ్చర్యపోతున్నారు. ఇక ఇదే సమయంలో ప్రభాస్ దుబాయ్ లో షూటింగ్ అయిపోయాక అక్కడ ఉన్న రాజ కుటుంబీకులతో సమావేశమవుతున్నారు.
నిన్న దీనికి సంబంధించి ఒక ఫోటో అంతర్జాలంలో ప్రత్యక్షం అయింది. ఈ ఫోటోలో ప్రభాస్ తన తమ్ముడితో కలిసి అక్కడ రాజ వంశీకులతో సమావేశమయ్యాడు. ఇక ప్రభాస్ సుమారు 60 రోజుల పాటు అక్కడే ఉండబోతున్నాడు, దీనితో అక్కడ ప్రభాస్ షూటింగ్ కాకుండా ఇంకేమి చేయనున్నాడు అన్న ఆసక్తి ఆయన అభిమానుల్లో మొదలైంది.
మరి ఆయన అభిమానుల అంచనాలని ప్రభాస్ అందుకుంటాడా లేదా అనేది ఇంకొన్ని రోజుల్లో తెలుస్తుంది.