బాలీవుడ్‌లో రెండు చిత్రాలు చేసిన అనుభవం ఉంది ముద్దుగుమ్మ కైరా అద్వానీకి. ఇటీవలే 'భరత్ అనే నేను' చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి సెన్సేషనల్ అయిపోయిందీ బ్యూటీ. ఫ్రెష్ ఫేస్‌తో ఫస్ట్ మూవీకే మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుసుకుంది. అంతేనా మొదటి సినిమా సూపర్‌స్టార్‌తో అయితే, రెండో సినిమాకి మెగా పవర్ స్టార్‌తో ఛాన్స్ దక్కించుకుంది.
రామ్ చరణ్ - బోయపాటి శీను కలయికలో తెరకెక్కుతోన్న సినిమాలో కైరా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఓ వైపు స్టార్ హీరోల తో సినిమాలు చేస్తూనే, 'లస్ట్ స్టోరీస్' అంటూ బాలీవుడ్‌లో ఓ వెబ్ సిరీస్‌లో నటించింది. అడల్ట్ కంటెన్ట్ మూవీ అయిన ఈ వెబ్ సిరీస్‌తో కైరా అద్వానీ సూపర్ పాపులర్ అయిపోయింది.
ఇకపోతే అమ్మడికి దక్కిన ఆ పాపులారిటీతోనే ఓ బంపర్ ప్రాజెక్టుకు సైన్ చేసింది బాలీవుడ్‌లో. కరణ్‌జోహార్ నిర్మాణంలో ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో రూపొందుతోన్న ఓ చిత్రానికి కైరా అద్వానీ సైన్ చేసింది. 'గుడ్‌న్యూస్' టైటిల్‌తో రూపొందుతోన్న ఈ చిత్రంలో అక్షయ్ కుమార్, కరీనా కపూర్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. రాజ్‌మెహతా దర్శకత్వం వహిస్తున్నారు. వచ్చే ఏడాది జూలైలో ఈ సినిమా విడుదల కానుంది.
చూస్తుంటే, కైరా అద్వానీ బాలీవుడ్‌లో బిజీ అయిపోయేలానే అనిపిస్తోంది. అక్కడ బిజీ అయితే, మరి తెలుగులో సినిమాలు చేస్తుందా? అంటే తొలి సినిమాకే తనకింత పాపులారిటీ తెచ్చిన టాలీవుడ్‌ని ఎప్పటికీ మర్చిపోననీ, తెలుగు భాష లెక్క ఆడా ఉంటా, ఈడా ఉంటా అని 'రుద్రమదేవి'లో అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్ మాదిరి ఈ ముద్దుగుమ్మ కూడా తన స్టైల్‌లో చెప్పేస్తోంది మరి. అయితే మాటపై నిలబడుతుందో లేదో చూడాలిక.