ఫ్లాప్ జోడీకి.. మ‌ళ్లీ ఛాన్స్ ఇస్తాడా?

By Gowthami - July 15, 2020 - 10:00 AM IST

మరిన్ని వార్తలు

చిత్ర‌సీమ‌లో సెంటిమెంట్లు ఎక్కువ‌. వాటిని హీరోలూ, ద‌ర్శ‌కులు గుడ్డిగా ఫాలో అయిపోతుంటారు. ఓ సినిమా హిట్ట‌యితే ఆ జోడీని రిపీట్‌చేయ‌డానికి ఏమాత్రం ఆలోచించ‌రు ద‌ర్శ‌క నిర్మాత‌లు. ఫ్లాప్ జోడీ వైపు క‌న్నెత్తి కూడా చూడ‌రు. కానీ ఈ సెంటిమెంట్ ని బ్రేక్ చేయాల‌నుకుంటున్నాడ‌ట రామ్ చ‌ర‌ణ్‌.

 

చిరంజీవి - కొర‌టాల శివ కాంబినేష‌న్ లో `ఆచార్య‌` సినిమా రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. ఓ క‌థానాయిక‌గా కాజ‌ల్ సెట్టయ్యింది. ఇందులో మ‌రో నాయిక‌కీ ఛాన్స్ ఉంది. రామ్ చ‌ర‌ణ్ ప‌క్క‌న ఓ క‌థానాయిక‌ని వెదికి ప‌ట్టాలిప్పుడు. ఆ ఛాన్స్ కైరా అద్వానీకి ద‌క్కిన‌ట్టు తెలుస్తోంది. `విన‌య విధేయ రామా`లో చ‌ర‌ణ్ - కైరా జంట‌గా న‌టించారు. ఆ సినిమా డిజాస్ట‌ర్ అయ్యింది. అయినా స‌రే, కైరా వైపే చూస్తున్నాడు చ‌రణ్. `ఆచార్య‌`కి చ‌ర‌ణ్ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న సంగ‌తి తెలిసిందే. చ‌ర‌ణ్ చెప్పాడంటే కొర‌టాల య‌స్ అనాల్సిందే. పైగా `భ‌ర‌త్ అనే నేను`లో కైరాతో ప‌నిచేశాడు కొర‌టాల‌. సో.. త‌న‌కు ఇంకా కంఫ‌ర్ట్ గా ఉంటుంది. కైరా - చ‌ర‌ణ్‌ల‌ది ఫ్లాప్ కాంబో అయినా, కొర‌టాల - కైరాల‌ది మాత్రం హిట్ కాంబో క‌దా. అందుకే.. కైరా రాక దాదాపు ఖాయంగా అనిపిస్తోంది. ‌


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS