'సైరా' జాతర కొనసాగుతోందిలా.!

మరిన్ని వార్తలు

2019 సమ్మర్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న 'సైరా నరసింహారెడ్డి' ఈ మధ్యలో తరచుగా ఏదో ఒక ప్రోమోతో హల్‌చల్‌ చేస్తూనే ఉంటుంది. గత నెలలో చిరంజీవి పుట్టినరోజుతో హంగామా మొదలైంది. టీజర్‌ ప్రభంజనం సృష్టించింది. 

నెక్ట్స్‌ సుదీప్‌ లుక్‌ని రిలీజ్‌ చేశారు. అవుకు రాజు పాత్రలో సుదీప్‌ నటిస్తున్నాడు. సినిమాలో అత్యంత కీలకపాత్రలో ఇదొకటి. ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ దాంతో పాటుగా, మోషన్‌ పోస్టర్‌ విడుదలైంది. మోషన్‌ పోస్టర్‌లో 'సౖరా' బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ మరోసారి కిర్రాక్‌ పుట్టించింది. ఇలా ఈ సినిమాలో ప్రతీ పాత్రను పరిచయం చేస్తూ ఎప్పుడూ ఏదో ఒక ప్రోమోతో సినిమా మీద హైప్‌ ఇంకా ఇంకా పెంచుకుంటూ పోవాలని సైరా టీమ్‌ భావిస్తోంది. 

మరో పక్క బాలీవుడ్‌ నుండి భారీ ఆఫర్లు సైరా కోసం వస్తున్నాయట. కానీ నిర్మాత రామ్‌చరణ్‌ ఈ విషయంలో తొందరపడదలచుకోలేదు. 'సైరా' రిలీజ్‌ డేట్‌ కన్‌ఫామ్‌ చేసుకున్నాకే బాలీవుడ్‌ రిలీజ్‌ విషయంలో చరణ్‌ ఓ నిర్ణయానికి వస్తాడట. నయనతార, విజయ్‌ సేతుపతి, తమన్నా.. ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్‌ ఇంకా చాలానే ఉంది. 

ఇంత భారీ తారాగణం ఓ పక్క. బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ ఇంకోపక్క. వీటిన్నింటికీ మించి మేకింగ్‌, తెలుగు సినీ పరిశ్రమలో కనీ వినీ ఎరుగని రేంజ్‌లో ఉంటుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS