కిరణ్ అబ్బవరం, ప్రియాంక జవాల్కర్ జంటగా కొత్త చిత్రం.!

మరిన్ని వార్తలు

ఎలైట్ ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ నెంబర్ 1 పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. రాయచోటి ఎమ్.ఏల్.ఏ శ్రీకాంత్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొని కెమెరా స్విచ్ ఆన్ చేశారు. మదనపల్లి ఎమ్ఎల్ఏ నవాజ్ బాషా క్లాప్ కొట్టారు. రాజా వారు రాణి గారు సినిమాతో సక్సెస్ సాధించిన హీరో కిరణ్ అబ్బవరం హీరోగా టాక్సివాల హీరోయిన్ ప్రియాంక జవాక్కర్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాతో శ్రీధర్ గాదె దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.

 

డైలాగ్ కింగ్ సాయి కుమార్ ఒక ముఖ్య పాత్రలో నటిస్తోన్న ఈ సినిమాకు ఆర్.ఎక్స్ 100 మ్యూజిక్ డైరెక్టర్ చేతన్ భరద్వాజ్ స్వరాలు సమకూరుస్తున్నారు. ఫిబ్రవరి చివరివారం నుండి ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS