బిగ్ బాస్ హౌస్ నుండి మూడవ వారం ఎలిమినేషన్ కి గురైన కిరీటి దామరాజు ప్రస్తుతం బిగ్ బాస్ ఇంటిలో తన అనుభవాలని పలు న్యూస్ ఛానల్స్ తో పంచుకుంటున్నాడు.
అయితే ఇప్పటివరకు హౌస్ నుండి బయటకి వచ్చిన ముగ్గురిలో ఇద్దరు సామాన్యులు కావడంతో వారికి ఎటువంటి రెమ్యునరేషన్ రాలేదు అని తేలింది. అయితే ఇప్పుడు మూడవ వారం బయటకి వచ్చిన కిరీటి సెలబ్రిటీ అవ్వడంతో ఆయనకి రెమ్యునరేషన్ రూపంలో ఎంత దక్కింది అనే ఆసక్తి అందరిలో నెలకొని ఉంది.
ఇక ఇదే అంశం పై ఆయన స్పందిస్తూ తనకి బిగ్ బాస్ నిర్వాహకులు నాకు రూ 6 లక్షలు ఇవ్వగా అందులో ట్యాక్స్ కట్టగా మిగిలిన మొత్తం అంటే సుమారు రూ 4 లక్షల 60వేల వరకు నాకు వచ్చింది.
ఈ సమాధానంతో బిగ్ బాస్ హౌస్ రెమ్యునరేషన్ల పైన ఒక క్లారిటీ అయితే వచ్చింది అని అనుకోవచ్చు.