కొబ్బ‌రి మ‌ట్టా??... ఇది ప‌బ్లిసిటీ స్టంటా..??

By iQlikMovies - July 23, 2019 - 19:00 PM IST

మరిన్ని వార్తలు

ఆర్ ఎక్స్ 100 తో ఆకట్టుకున్న కార్తికేయ హిప్పీతో ఫ్లాఫ్ తిన్నాడు. మొన్న వచ్చిన ఆ సినిమా పెద్ద తలనొప్పిగా మారింది. సినిమా చూసిన జనాలు తలలు పట్టుకున్నారు. ఇదేం జండూబాంబ్ సినిమా అనుకున్నారు. టోటల్ గా పెద్ద డిజాస్టర్ గా నిలిచింది హిప్పీ. అయితే ఎవరికీ పనికిరాకుండా పోయిన హిప్పీ సినిమా ఇప్పుడు సంపూర్ణేశ్‌బాబు ‘కొబ్బరిమట్ట’కి పనికొచ్చింది. ఎలా అంటే? హిప్పీ సినిమా హీరో కార్తికేయపై ‘కొబ్బరిమట్ట’ నిర్మాత ఫైర్ అయ్యారు. దీనికి కారణం ఇటివలే ఆయన హిప్పీ చుశారట. ఇందులో ‘కొబ్బరిమట్ట’ సీన్ చూసి హీరో నవ్వుకున్న సీన్ వుంది.

 

దిన్నిపట్టుకొని ‘హాయ్‌ కార్తికేయ... ‘హిప్పీ’ సినిమాలో ‘కొబ్బరిమట్ట’ చిత్రాన్ని, సంపూర్ణేశ్‌బాబుని, నన్ను టార్గెట్‌ చేసిన సన్నివేశాన్ని చూశాను. నటుడిగా ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి సినిమాను, సహ నటులను గౌరవించండి ప్లీజ్’ అని ట్వీట్ చేశారు. దీనిపై సంపూర్ణేశ్‌బాబు కూడా ట్వీట్ వేశాడు. ‘కార్తికేయ.. నా మీద వేసిన జోక్‌కి ఫర్వాలేదు. కానీ విడుదలవ్వని సినిమా గురించి తప్పుగా మాట్లాడటం న్యాయం కాదు. ఎన్నో కష్టాలు పడి తీసిన సినిమా ‘కొబ్బరిమట్ట’. ఇలా చేయడం బాధాకరం’ అన్నాడు సంపూ.

 

‘కొబ్బరిమట్ట' ఎప్పుడో ఐదేళ్ళ క్రితం సినిమా. ఏవో కారణాలు వల్ల ల్యాబ్ కే పరిమితమైపోయింది. ఇప్పుడు బయటికి తీస్తున్నారు. ఏదో ఒక బజ్ కావాలి. సో..ఆర్ ఎక్స్ 100 కార్తికేయ దొరికాడు. అటు నుండి ఓ ట్వీట్ వస్తే.. ఓ చిన్న వివాదం తెరపైకి వస్తుంది. మరక మంచిదే అన్నట్టు.. వివాదం సినిమా ప్రమోషన్స్ కి ఓ సరసమైన మార్గం. మరి దీనిపై కార్తికేయ స్పందిస్తాడో లేదో చూడాలి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS