రామ్ గోపాల్ వర్మ, పూరి జగన్నాధ్ బంధం ఇప్పటిది కాదు. శివ సినిమా నుండే మొదలైయింది. అప్పటి నుండే వర్మతో ట్రావెల్ అవుతున్నాడు పూరి. ఆయన్నే గురువుగా చేసుకున్నాడు. ''కుదిరితే వర్మని పెంచుకుంటా'' అని తనదైన శైలిలో చెబుతుంటాడు పూరి. వర్మకి కూడా పూరి అంటే ప్రేమ. ఇప్పుడు పూరి తీసిన 'ఇస్మార్ట్ శంకర్' కి స్పెషల్ ప్రమోషన్స్ చేసి పెట్టాడు వర్మ. వర్మ మాస్ గెటప్ లో థియేటర్ కి వెళ్ళడం, వైన్ బాటిల్ మీద వేసుకోవడం .. ఈ హడావిడి అంతా ప్రమోషన్ కి పనికొచ్చింది. బేసిగ్గా వర్మ తన సినిమాకి కూడా ఇలాంటి ప్రమోషన్ చేయడు. ఎవరినో కెలికి టీవీలో కూర్చోవడం వరకే.
కానీ పూరి సినిమా విషయంలో ఓ మెట్టు దిగాడు వర్మ. గ్రౌండ్ లెవల్ ప్రమోషన్స్ కి సహకరించాడు. నిజంగా వర్మ లాంటి నేషనల్ ఫిగర్ ఇలా ప్రమోషన్స్ కి కలసి రావడం ఇస్మార్ట్ శంకర్ కి చాలా పాజిటివ్ నోట్. వర్మకి ఎంతో మంది శిష్యులు వున్నారు. బాలీవుడ్ ఒరిజనల్ ఫిలిం మేకర్స్ కనిపించుకున్న అనురాగ్ కశ్యప్ మొదలుకొని ఇక్కడ కృష్ణవంశీ, తేజ.. ఇలా బోలెడు మంది. కానీ వీరిందరికి ఇవ్వని ప్రాధాన్యత పూరికి ఇచ్చాడు వర్మ. మరి ఇంత స్పెషాలిటీ పూరి ఏం వుందో.. వర్మకి మాత్రమే తెలుసు.