టాలీవుడ్‌లో ప్రకంపనలు సృష్టిస్తోన్న శ్రీరెడ్డి లీక్స్ తాజాగా ప్రముఖ రచయిత, నిర్మాత కోనవెంకట్‌ని చుట్టుముట్టాయి. కోన వెంకట్ ఒకానొక సందర్భంలో తనను బలవంతం చేయబోయాడని ఆరోపణలు చేసింది. దాంతో కోనవెంకట్ స్పందించాడు.
టాలీవుడ్‌ని సాఫ్ట్ టార్గెట్‌గా చేసుకుంటున్నారు కొంతమంది. ఈ మధ్య ఈ ధోరణి చాలా ఎక్కువైపోయిందనీ, ఇలాంటి అసత్య ఆరోపణలు చేస్తున్న వారికి సరైన కౌన్సిలింగ్ ఇప్పించాలి లేదా విచారణ చేయించి నిజాల్ని నిగ్గు తేల్చాలనీ పేర్కొంటూనే, 'గీతాంజలి' సినిమా కోసం అంతా తెలుగు వారినే తీసుకున్నాననీ, ఆ సినిమాకి తానే స్క్రీన్‌ప్లే చేశాననీ ఆయన గుర్తు చేశారు.
గత నెల రోజులుగా శ్రీరెడ్డి లీక్స్ టాలీవుడ్ ప్రముఖులకు టెన్షన్ క్రియేట్ చేస్తోంది. టాలీవుడ్‌లో తెలుగు వారికి అవకాశాలు రావడం లేదు అనే దిశగా ప్రారంభమైన ఆమె పోరాటం గాడి తప్పడంతో, ఇప్పటికే ఆమెకు 'మా' నుండి సభ్యత్వం ఇవ్వలేదు సరికదా. ఆమెతో కలిసి నటించొద్దని నటీనటులకు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఈ రకంగా ఆమెపై బ్యాన్ విధించినా కానీ, ప్రముఖులపై చేస్తున్న ఆరోపణలకు అడ్డుకట్ట వేయడం లేదు శ్రీరెడ్డి.
మరోపక్క ఆమె ఆరోపణలకు భిన్నాభిప్రాయాలు వెల్లడవుతున్నాయి. ఇండస్ట్రీ నుండే పలువురు ఆమెను వ్యతిరేకిస్తున్న వారున్నారు. కొందరు ఆమెను సపోర్ట్ చేస్తున్నారు కానీ, ఆమె వ్యక్తం చేస్తోన్న నిరసన దారి సరైనది కాదని అంటున్నారు. ఏమో చూడాలి శ్రీరెడ్డి లీక్స్ ఇంకా ఎంత వరకూ చేరతాయో. రోజుకో అప్‌డేట్‌తో అమ్మడు సెన్సేషన్ అవుతోంది.