చిరంజీవి, రామ్ చరణ్ ఇద్దరూ ఒకేసారి, ఒకేతెరపై కనిపిస్తే ఎలా ఉంటుంది? దానికి టీజర్లా `మగధీర`లో ఓ సీన్ క్రియేట్ చేశాడు ఎస్.ఎస్.రాజమౌళి. ఇప్పుడు కొరటాల శివ ఏకంగా సినిమానే చూపించడానికి రెడీ అయ్యాడు. చిరంజీవి 'ఆచార్య'లో రామ్ చరణ్ ఓ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. నిజానికి రామ్ చరణ్‌ని ముందుగా గెస్ట్ రోల్ కోసం అనుకున్నారు. కానీ క్రమంగా ఆ పాత్ర పరిధి పెరుగుతూ పోయింది. చరణ్ కోసం ఓ హీరోయిన్, పాట, ఫైటింగు.. ఇలా ఆ పాత్రని పెంచుకుంటూ వెళ్లారు. ఇప్పుడు చిరు - చరణ్‌ల మధ్య ఓ ఫైట్ కూడా డిజైన్ చేయాలనుకుంటున్నాడట కొరటాల.
ఈ సినిమాలో చిరు - చరణ్‌లను గురు శిష్యులుగా చూపించబోతున్నాడు కొరటాల. గురు, శిష్యులుగా మారడానికి ముందు... వీరిద్దరితో ఓ ఫైట్ చేయిస్తే.. అభిమానులకు ఓ కొత్త ట్రీట్ ఇచ్చినట్టు అవుతుందని భావిస్తున్నాడట. 'ఖైది నెం 150'లో ఓ పాటలో చిరు, చరణ్ స్టెప్పులు వేస్తూ కనిపించారు. ఆ సన్నివేశాలు.. మెగా ఫ్యాన్స్‌ని ఎంతగానో అలరించాయి. ఇప్పుడు ఫైటింగులు మొదలెట్టారు. మరి దీనికి రెస్పాన్స్ ఎలా ఉంటుందో?