కొరటాల దర్శకత్వంలో మహేష్‌?

మరిన్ని వార్తలు

కొరటాల శివతో మహేష్‌బాబు ఆల్రెడీ రెండు బ్లాక్‌ బస్టర్‌ హిట్స్‌ కొట్టేశాడు. మొన్న 'శ్రీమంతుడు', నిన్న 'భరత్‌ అనే నేను'. ఇప్పుడు మరో హిట్‌కీ రెడీగానే ఉన్నాడు. అయితే అందుకు కాస్త టైం పడుతుంది. కానీ ఆ లోగా వీరిద్దరి కాంబినేషన్‌లో ఓ కమర్షియల్‌ యాడ్‌ రాబోతోంది. ఈ యాడ్‌లో మహేష్‌బాబుతో పాటు, కమెడియన్‌ వెన్నెల కిషోర్‌ కూడా కనిపించబోతున్నాడీ యాడ్‌లో. ఇంతకీ ఆ యాడ్‌ ఏంటంటారా? 'అబీ బస్‌ యాడ్‌'. ఆల్రెడీ మహేష్‌బాబు మరో కమెడియన్‌ కృష్ణుడుతో కలిసి ఈ యాడ్‌ చేశాడు.

తాజాగా ఇదే యాడ్‌ని మహేష్‌ - వెన్నెల కిషోర్‌ కాంబినేషన్‌లో షూట్‌ చేశారు. తాజాగా షూటింగ్‌ కంప్లీట్‌ చేసుకున్న ఈ కమర్షియల్‌ యాడ్‌కి దర్శకుడు కొరటాల శివ దర్శకత్వం వహించాడు. ఈ యాడ్‌కి సంబంధించి షూటింగ్‌ స్పాట్‌లో మహేష్‌తో వెన్నెలకిషోర్‌ దిగిన ఫోటోలు సోషల్‌ మీడియాలో సందడి చేస్తున్నాయి. ఈ ఫోటోలో మహేష్‌ కూతురు సితార కూడా ఉంది. ఇదిలా ఉంటే, ప్రస్తుతం మహేష్‌బాబు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేస్తున్న సినిమా హైద్రాబాద్‌లో షూటింగ్‌ జరుపుకుంటోంది.

ఈ సినిమాకి 'రిషి' అనే టైటిల్‌ పరిశీలనలో ఉంది. పూజా హెగ్దే హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో అల్లరి నరేష్‌ కీలక పాత్ర పోషిస్తున్నాడు. మరోవైపు స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కూడా మహేష్‌లాగే ఈ తరహా వాణిజ్య ప్రకటనలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ యాడ్‌లో ఓ సారి షియాజీషిండేతోనూ, తర్వాత ఆలీతోనూ నటించాడు బన్నీ. మహేష్‌ది 'అబి బస్‌' అయితే, బన్నీది 'రెడ్‌ బస్‌'. అదీ సంగతి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS