కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ‘జనతా గ్యారేజ్’ సినిమా వచ్చిన విషయం విదితమే. ఆ సినిమా అప్పట్లో సంచలన విజయాన్ని అందుకుంది. యంగ్ టైగర్, కొరటాల మధ్య ఇప్పటికీ సన్నిహిత సంబంధాలు అలాగే కొనసాగుతున్నాయి. యంగ్ టైగర్ అంటే కొరటాలకి ప్రత్యేకమైన అభిమానం. అయితే, వయసులో యంగ్ టైగర్ కంటే పెద్దవాడే అయినా, కొరటాల ఇప్పుడు తాజాగా యంగ్ టైగర్ని ‘అన్నయ్యా’ అని పిలవడం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది. అసలు విషయానికొస్తే, ‘బి ద మ్యాన్ ఛాలెంజ్..’ అంటూ యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివని నామినేట్ చేశాడు.
‘ఇంటి పనులు చేయడం’ ఈ ఛాలెంజ్ ఉద్దేశ్యం. కొరటాలతోపాటు, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్లనూ నామినేట్ చేశాడు యంగ్ టైగర్. ఈ ఛాలెంజ్‌ని యాక్సెప్ట్ చేస్తున్నట్లు ప్రకటించిన కొరటాల ‘అన్నయ్యా..’ అని సంబోదించాడు యంగ్ టైగర్ని ఉద్దేశించి. అన్నట్టు, నెల రోజుల ఫుటేజ్ తాను మిస్ అయ్యానంటూ కొరటాల ట్వీట్ చేయడం గమనార్హమిక్కడ. అంటే, నెలరోజులుగా కొరటాల ఇంటి పనులతో బిజీ అయిపోయాడన్నమాట. కొరటాల మాత్రమే కాదు, చాలామంది సెలబ్రిటీలు చేస్తున్న పని ఇదే. అయితే, దానికి ‘బి ద మ్యాన్ ఛాలెంజ్’ పేరుతో ఇప్పుడు ఇంకాస్త ఇంట్రెస్టింగ్ టాస్క్ యాడ్ అయ్యిందన్నమాట. కొరటాల శివ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో ‘ఆచార్య’ సినిమాని రూపొందిస్తున్న విషయం విదితమే.