టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ దర్శకులలో కొరటాల శివ ఒకరు. వరుసగా అన్నీ హిట్లే. ఒక దాన్ని మించి మరో విజయం. వరుసగా స్టార్లతోనే పనిచేస్తూ వచ్చారు కొరటాల. ఇప్పుడు అల్లు అర్జున్ కోసం కథ సిద్ధం చేస్తున్నట్టు టాక్. అల్లు అర్జున్ - కొరటాల కాంబోలో ఓ సినిమా త్వరలోనే రాబోతోందని విశ్వసనీయ వర్గాల సమాచారం. నిజానికి బన్నీతో సినిమా చేయాలని కొరటాల ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నారు.
'అల వైకుంఠపురములో' కంటే ముందు వీరిద్దరి మధ్య చర్చలు జరిగాయి. కానీ.. ఎవరి ప్రాజెక్టుల్లో వాళ్లు బిజీగా ఉండడం వల్ల కుదర్లేదు. ఇన్నాళ్లకు ఈ ప్రాజెక్టు కుదిరింది. ప్రస్తుతం 'పుష్ష'తో బిజీగా ఉన్నాడు బన్నీ. 'ఆచార్య' ప్రాజెక్టులో తలమునకలై ఉన్నాడు కొరటాల. ఇవి రెండూ పూర్తయ్యాకే ఈ కొత్త ప్రాజెక్టు పట్టాలెక్కుతుంది. ఇది కూడా పాన్ ఇండియా స్థాయిలోనే నిర్మిస్తారని సమాచారం.