దర్శకుడు కొరటాల శివకి ఆచార్య తో ఫస్ట్ ఫ్లాఫ్ పడింది. ఎవరూ వూహించని రీతిలో సినిమా డిజాస్టర్ అయ్యింది. ఆచార్య వీకెండ్ మొత్తం కలెక్షన్ సైరా ఒక్క రోజు కలెక్షన్ తో సమానం అంటే అర్ధం చేసుకోవచ్చు ఆచార్య ఫలితం ఎంత పేలవంగా వుందో. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ సినిమా చేయబోతున్నారు శివ. జూన్ లో సెకండ్ వీక్ లో షూటింగ్ మొదలుపెడతారని వార్తలు వచ్చాయి. ఐతే తాజాగా సమాచారం ప్రకారం.. కొరటాల బ్రేక్ తీసుకోబోతున్నారని తెలిసింది. ఆచార్య ఫలితం కొరటాలని ఆలోచనలో పడేసింది. ఎన్టీఆర్ కి స్క్రిప్ట్ ఓకే అయినప్పటికీ కొరటాల ఇంకాస్త సమయం కావాలని కోరినట్లు తెలుస్తుంది.
ఆచార్య అపజయాన్ని విశ్లేషించుకుని.. ఎన్టీఆర్ కి రాసుకున్న స్క్రిప్ట్ లో కూడా కొన్ని మార్పులు చేసి.. పక్కా స్క్రిప్ట్ అనుకున్న తర్వాతే షూటింగ్ కి వెళ్లాలని కొరటాల భావిస్తున్నారని టాక్. ఎన్టీఆర్ కూడా దీనికి అంగీకరించినట్లు సమాచారం. దాదాపు ఆరు నెలలు గడువు కోరారట కొరటాల. ఆరు నెలలు అంటే పెద్ద గ్యాప్ .. మరి ఈ మధ్యలో ఎన్టీఆర్ ప్లాన్స్ ఎలా వుంటాయో చూడాలి.