కొరటాల... రాజమౌళి తరవాత మెస్ట్ వాంటెడ్ దర్శకుడు. తన ఖాతాలో ఉన్నవన్నీ సూపర్ హిట్ సినిమాలే. ఒక్క ఫ్లాపు కూడా రుచి చూడలేదు. పైగా ఒకదాన్ని మించి మరో హిట్టు. అందుకే అంత డిమాండ్. పెద్ద హీరోలంతా కొరటాలతో సినిమా అంటే క్యూ కట్టేది ఇందుకే. ఇప్పుడు చిరంజీవి 152వ సినిమా `ఆచార్య`కి తనే దర్శకుడు. ఆ సినిమా ముగిసిన తరవాత కూడా కొరటాల మెగా కాంపౌండ్‌ని వదిలే అవకాశం కనిపించడం లేదు. ఎందుకంటే వరుసగా రెండు సినిమాలు మెగా హీరోలతోనే చేయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. చిరంజీవి తో సినిమా ముగిసిన వెంటనే.. రామ్ చరణ్ తో కొరటాల ఓ సినిమా చేస్తాడని టాక్. నిజానికి ఆచార్య కంటే ముందే చరణ్ - కొరటాల సినిమా పట్టాలెక్కాల్సింది. కానీ కుదర్లేదు.
2021లో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవకాశాలున్నాయి. మరోవైపు అల్లు అర్జున్ కూడా కొరటాలతో ఓసినిమా చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నాడని తెలుస్తోంది. ఈ మేరకు కొరటాలతో సంప్రదింపులు కూడా మొదలయ్యాయని సమాచారం. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ లో నిర్మించే అవకాశాలున్నాయి. అంతా ఓకే అయితే.. 2022 వరకూ కొరటాల మెగా కాంపౌండ్లోనే ఉండిపోతాడన్నమాట.