స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూనే సుకుమార్ చిన్న హీరోలతో కూడా సినిమాలు చేస్తుంటాడు. అయినా కానీ తన దగ్గర చాలా కథలుండిపోతాయట. అందుకే వేరే డైరెక్టర్స్‌కి తన కథలనందిస్తూ ఉంటాడు. అలాగే నిర్మాణ భాగస్వామ్యం కూడా వహిస్తుంటాడు. ఆ రకంగా చిన్న సినిమాల్లో తానూ ఓ భాగం అవుతూ ఉంటాడు సుకుమార్.
అలాగే ఇప్పుడు కొరటాల శివ కూడా చేయాలనుకుంటున్నాడట. తాజాగా మహేష్‌బాబుతో 'భరత్ అనే నేను' సినిమాతో హిట్ కొట్టిన కొరటాల నెక్ట్స్ చేయబోతున్న సినిమా ఏంటనే దానిపై ఆశక్తి నెలకొంది. కొరటాల ఓకే అంటే స్టార్ హీరోలు క్యూ కడతారు. కానీ కొరటాల నెక్ట్స్ ఓ చిన్న హీరోతో సినిమా చేయాలనుకుంటున్నాడనీ సమాచారమ్. అది నేచురల్ స్టార్ నానితో అని ప్రచారం జరుగుతోంది. అయితే నాని సినిమాకి కొరటాల డైరెక్ట్‌గా దర్శకత్వం వహించడట.
కథ, స్క్రీన్‌ప్లే మాత్రమే కొరటాల ఇవ్వనున్నారట. డైరెక్టర్, నిర్మాత వేరే వాళ్లనీ తెలుస్తోంది. మరోవైపు కొరటాల - అల్లు అర్జున్ కాంబినేషన్‌లో సినిమా ఉండబోతోందని టాక్ వినిపిస్తోంది. అయితే విక్రమ్ కుమార్‌తో బన్నీ సినిమా చేయాలనుకుంటున్నాడట. ఇంతకీ కొరటాల సినిమా ఎవరితో ఉండబోతోందో తెలియదు
కానీ, చిన్ని హీరోలతో కూడా ఇకపై సినిమాలు చేసే యోచనలో కొరటాల ఉన్నట్లు తెలుస్తోంది. చూడాలి మరి.