టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ దర్శకుల జాబితాలో త్రివిక్రమ్ ఒకడు. తనతో సినిమా చేయాలని హీరోలంతా ఎదురు చూస్తుంటారు. త్రివిక్రమ్ స్టైల్ కూడా సెపరేట్ గా ఉంటుంది. తనతో పనిచేయడానికి ఎంత మంది రెడీగా ఉన్నా, తన దగ్గరున్న కథ ఏం డిమాండ్ చేస్తుందో... అదే చేస్తుంటాడు. కథని తగిన హీరోని అన్వేషిస్తుంటాడు. అందులో భాగంగా.. త్రివిక్రమ్ రామ్ తో ఓ సినిమా చేస్తాడని ప్రచారం జరిగింది. దీనిపై రామ్ ఇప్పుడు క్లారిటీ ఇచ్చేశాడు.
రామ్ మాట్లాడుతూ ``త్రివిక్రమ్ తో సంప్రందింపులు జరిపింది నిజమే. ఇద్దరం కలిసి సినిమా చేస్తాం. కానీ ఎప్పుడో చెప్పలేను. బహుశా.. 2022లో ఉండొచ్చు`` అని క్లారిటీ ఇచ్చాడు రామ్. 2021లో త్రివిక్రమ్ ... ఎన్టీఆర్ సినిమాతో బిజీ అవుతాడు. 2022లోనే ఫ్రీ అవుతాడు. అప్పటికి రామ్ చేతిలో ఉన్న ప్రాజెక్టులూ పూర్తవుతాయి. సో.. రామ్ - త్రివిక్రమ్ కాంబో చూడాలంటే 2022 వరకూ ఆగాలన్నమాట.