ఈమధ్యకాలంలో సోషల్ మీడియాలో సెలబ్రిటీలపైన అవాస్తవ కథనాలు ఎక్కువయ్యాయి. వీటివల్ల సదరు సెలబ్రిటీలు మీడియా ముందుకి వచ్చి క్లారిటీ ఇచ్చుకోవాల్సి వస్తున్నది.
ఈ జాబితాలోకి తాజాగా కోట శ్రీనివాసరావు గారు చేరారు. నిన్న ఆయన ప్రత్యేకంగా మీడియాని పిలిచి తన ఆరోగ్యం బాగానే ఉంది, తనకి ప్రాణాపాయం ఏమిలేదు అని వివరణ ఇచ్చారు.
గత కొంతకాలంగా కోట శ్రీనివాసరావు గారి ఆరోగ్యం పైన, ఆయన తీవ్ర అనారోగ్యంతో భాదపడుతున్నారు అన్న వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. వీటికి ముగింపు పలికేలా ఆయన నిన్న వివరణ ఇవ్వడం జరిగింది.
మొత్తానికి ఇటువంటి వార్తలు సెలబ్రిటీలకి మనఃశాంతి లేకుండా చేస్తున్నాయి.