సినిమా రిలీజ్ విషయమై చిన్న చిన్న సమస్యలు ఎదురయినా, సినిమా రిలీజయ్యాక మాత్రం అదిరిపోయే వసూళ్ళు వచ్చేస్తున్నాయట ‘క్రాక్’ సినిమాకి. మార్కెట్‌లో ప్రస్తుతానికి సరైన పోటీ ఏమీ లేకపోవడం రవితేజ ‘క్రాక్’కి బాగా కలిసొచ్చింది. చాలా కాలంగా వెండితెరపై సినిమాల్లేక విలవిల్లాడిన తెలుగు సినీ ప్రేక్షకులు, కరోనా భయాలు ఇంకా అలాగే వున్నా.. థియేటర్లకు బాగానే వెలుతున్నారు. సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన ‘సోలో బ్రతుకే సో బెటర్’ కూడా పోటీ లేకపోవడంతో మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.
ప్రస్తుతానికైతే టాక్‌తో సంబంధం లేకుండా సినిమాలు ఆడేసే పరిస్థితి వుంది. కానీ, ఇకపై అలా కుదరకపోవచ్చు. ఈ సీజన్‌లో డిజడ్వాంటేజ్‌ని అడ్వాంటేజ్‌గా మార్చకున్న సినిమాలుగా ‘సోలో బ్రతుకే సో బెటర్’ ఫస్ట్ ప్లేస్‌లో వుంటే, రెండో ప్లేస్ ‘క్రాక్’ సినిమాదే. సంక్రాంతికి సినిమాల జోరు పెరుగుతున్న దరిమిలా, ఇకపై ఈ అడ్వాంటేజ్ కుదరకపోవచ్చు. కాగా, రిలీజ్ టెన్షన్స్ నేపథ్యంలో రవితేజ అప్పీల్, సినిమాకి బాగా కలిసొచ్చిందట. రవితేజ అభిమానులు రిపీటెడ్‌గా సినిమా చూస్తున్నారనీ, సాధారణ ప్రేక్షకులూ సింపతీ వర్షాన్ని సినిమాపై కురిపిస్తున్నారనీ సినీ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.