వరుస పరజయాల పరంపరకు బ్రేక్ వేస్తూ.. `క్రాక్` సినిమాతో ఓ సూపర్‌హిట్టు అందుకున్నాడు రవితేజ. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 9న విడుదలై... సంక్రాంతి హిట్టుగా నిలిచింది. 50 శాతం ఆక్యుపెన్సీలో కూడా.. మంచి వసూళ్లనే అందుకుంది. సంక్రాంతి హంగామా తగ్గిన తరవాత కూడా.. `క్రాక్` హవా చూపించే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. తొలి వారం రూ.21 కోట్లు తెచ్చుకుంది క్రాక్. సరిగ్గా.. తొలి వారానికే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయిపోయింది. ఇక నుంచి వచ్చే ప్రతీ రూపాయీ.. లాభమే.
క్రాక్ తొలి వారం వసూళ్ల వివరాలు
నైజామ్ : 7.10 కోట్లు
సీడెడ్ : 3.7 కోట్లు
వైజాగ్ : 2.30 కోట్లు
గుంటూరు : 1. 77 కోట్లు
కృష్ణా : 1. 47 కోట్లు
ఈస్ట్ గోదావి : 1.90 కోట్లు
వెస్ట్ గోదావరి : 1. 68 కోట్లు
నెల్లూరు : 1. 1 కోటి
మొత్తం రెండు రాష్ట్రాలలో కలిపి.. సుమారు.. 21 కోట్లు.