వరుణ్ తేజ్ కథానాయకుడిగా నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటితో ఓ సినిమా రూపుదిద్దుకుంటోంది. బాక్సింగ్ నేపథ్యంలో నడిచే కథ ఇది. ఈ చిత్రానికి `గని` అనే పేరు ఫిక్స్ చేశారు. ఈరోజు వరుణ్ పుట్టిన రోజు సందర్భంగా ఈసినిమా టైటిల్ ని ప్రకటించారు. ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు.
బాక్సింగ్ రింగ్ లో పంచ్‌లు కొడుతున్న వరుణ్ ని చూపించారు. బాలు సినిమాలో పవన్ కల్యాణ్ పాత్ర పేరు గని. దాన్నే ఇప్పుడు టైటిల్ గా ఖరారు చేశారన్నమాట. ఈ సినిమాలో.. వరుణ్ పేరు కూడా గనినే. తండ్రి సెంటిమెంట్ ప్రధానంగా సాగే కథ ఇది. వరుణ్ తేజ్ ఉపేంద్ర నటిస్తున్నాడు. సునీల్ శెట్టి, జగపతిబాబు, నవీన్ చంద్ర కీలకమైన పాత్రలు పోషిస్తున్నారు. ఈ యేడాది జులైలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తారు.