క్రాక్‌.... మార్నింగ్ షో.. ఇలా జ‌రిగిందేంటి?

మరిన్ని వార్తలు

సంక్రాంతి సంబ‌రాలు క్రాక్ తో మొద‌ల‌య్యాయి. ఈరోజే ఈ సినిమా రిలీజ్‌. అయితే.. విడుద‌ల రోజున‌... క్రాక్ షాక్ ఇచ్చింది. మార్నింగ్ షోలు ర‌ద్దు అయ్యాయి.హైద‌రాబాద్ ఇత‌ర మెట్రో న‌గ‌రాల‌లో 9 గంట‌ల‌కే షోలు ప‌డాలి. అయితే.. అవ‌న్నీ క్యాన్సిల్ చేసేశారు. చివ‌రి నిమిషంలో.. క్రాక్ కి ఫైనాన్సియ‌ల్ స‌మ‌స్య‌లు ఎదురు రావ‌డంతో.. శుక్ర‌వారం అర్థ‌రాత్రి వ‌ర‌కూ.. పంచాయితీ జ‌రిగింద‌ని, దాంతో... శ‌నివారం ఈ సినిమా విడుదల అవుతుందా, లేదా, అనే టెన్ష‌న్ మొద‌లైంద‌ని, చివ‌రికి ఈ వ్య‌వ‌హారాల‌న్నీ సెటిల్ చేశార‌ని, అయితే.. మార్నింగ్ షో స‌మ‌యానికి ప‌రిస్థితి స‌ద్దుమ‌ణ‌గ‌క పోవ‌డంతో.. ఆ షోల‌న్నీ క్యాన్సిల్ చేశార‌ని తెలుస్తోంది.

 

ఈ రోజు `క్రాక్ `విడుద‌ల అవుతోంది. కానీ ... కాస్త ఆల‌స్యంగా. మార్నింగ్ షోలు ర‌ద్దు అవ్వ‌డంతో.. ఫ్యాన్స్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తొలి రోజు మంచి వ‌సూళ్లు అందుకోవాల‌ని చూసిన నిర్మాత‌కు.. ఇది పెద్ద దెబ్బే. ర‌వితేజ - శ్రుతి హాస‌న్ జంట‌గా న‌టించిన ఈ చిత్రానికి గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌కుడు. త‌మ‌న్ సంగీతం అందించారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS