అఖిల్ నుంచి ఇప్పటి వరకూ మూడు సినిమాలొచ్చాయి. మూడూ ఫ్లాపులే. తొలి సినిమా `అఖిల్` కోసం భారీగా ఖర్చు పెట్టారు. దాంతో నిర్మాత నితిన్ బాగా నష్టపోయాడు. ప్రస్తుతం `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్`పైనే ఆశలు పెట్టుకున్నాడు అఖిల్.
అయితే ఈలోగా 4వ సినిమా సెట్టయ్యింది. దీనికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తాడు. క్రిష్ నిర్మాత. ఇప్పటికే అఖిల్, క్రిష్ లకు సూరి లైన్ వినిపించేశాదట. బడ్జెట్ లెక్కలు కూడా వేసి చూపించాడట. మొత్తం 45 కోట్ల లెక్క తేలిందని సమాచారం. అఖిల్ పై అంత పెట్టుబడి పెట్టడం రిస్కే. కాకపోతే.. సురేందర్ రెడ్డిపై క్రిష్‌కి నమ్మకం ఉంది. అందుకే... ఇంత భారీ బడ్జెట్ ని మోయడానికి ముందుకు వస్తున్నాడని తెలుస్తోంది. ఈ ఖర్చుని తగ్గించే ప్రయత్నాల్ని అన్వేషించమని సురేందర్ కి సూచించాడట క్రిష్. కానీ సూరి... ది అంతా స్టైలీష్ మేకింగ్. తెరపై హంగులన్నీ భారీగా ఉండాలని భావిస్తాడు. సూరితో.. బడ్జెట్ కోతలు కుదరవు. 45 కోట్లకూ క్రిష్ ఫిక్సయిపోవాల్సిందే.