ఓటీటీలో మరో చిన్న సినిమా.?

By Inkmantra - May 02, 2020 - 16:30 PM IST

మరిన్ని వార్తలు

లాక్‌డౌన్‌ నేపథ్యంలో ధియేటర్స్‌ ఎప్పుడు ఓపెన్‌ అవుతాయో తెలియని గందరగోళ పరిస్థితి నెలకొంది. పెద్ద సినిమాల సంగతి అటుంచితే, చిన్న సినిమాల నిర్మాతలు గగ్గోలు పెడుతున్నారు. తమ తమ సినిమాల్ని ఎప్పుడు రిలీజ్‌ చేయాలో తెలియక, సతమతమవుతున్నారు. ఈ తరుణంలోనే ఓటీటీ ప్లాట్‌ఫామ్.. ‌ ఎడారిలో ఓయాసిస్‌లా గోచరించింది ఆయా చిన్న నిర్మాతల పాలిట.

 

ఇప్పటికే ఓటీటీలో ‘అమృతారామమ్‌’ అనే ఓ చిన్న సినిమా రిలీజై బోణీ కొట్టింది. అయితే, ఈ సినిమా రిజల్ట్‌ ఏంటనేది చెప్పలేం కానీ, ఇప్పుడు మరో చిన్న సినిమా ఓటీటీ రిలీజ్‌కి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అదే ‘కృష్ణ అండ్‌ హిజ్‌ లీల’. ట్రయాంగిల్‌ లవ్‌ అండ్‌ డిఫరెంట్‌ కాన్సెప్ట్‌ మూవీగా రూపొందిన ఈ సినిమాకి దర్శకుడు రవికాంత్‌ పేరెపు. ‘క్షణం’ వంటి సూపర్‌ హిట్‌ చిత్రాన్ని తెరకెక్కించిన ఈయన ‘కృష్ణ అండ్‌ హిజ్‌ లీల’ అంటూ ఈ తాజా చిత్రాన్ని రూపొందించాడు. సిద్దు జోన్నగడ్డ ఈ సినిమాలో హీరో కాగా, సీరత్‌ కపూర్‌, షాలినీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ‘జెర్సీ’ ఫేమ్‌ శ్రద్ధా శ్రీనాధ్‌ ఇంపార్టెంట్‌ రోల్‌ పోషిస్తోంది.

 

మే 1న ఈ సినిమాని గ్రాండ్‌గా రిలీజ్‌ చేయాలనుకున్నారు. కానీ, లాక్‌డౌన్‌ కారణంగా కుదరలేదు. దాంతో ఈ సినిమా నిర్మాతలు ఓటీటీ రిలీజ్‌ ప్లానింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. అన్నట్లు ఈ సినిమాకి రానా సమర్పకునిగా వ్యవహరించారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS