శంకర్ దర్శకత్వంలో విక్రమ్ నటించిన సూపర్ హిట్ సినిమా 'అపరిచితుడు'. ఈ కాంబినేషన్లోనే వచ్చిన మరో భారీ చిత్రం 'ఐ' అంచనాల్ని మాత్రం అందుకోలేకపోయింది. అయితే విజువల్ వండర్‌గా 'ఐ' గురించి చెప్పుకుంటూనే వున్నాం. విజువల్ ఎఫెక్ట్స్ అంటే శంకర్‌కి చాలా ఇష్టం. తన సినిమాల్లో భారీ తనానికే ఆయన పెద్ద పీఠ వేస్తుంటాడు.
ఈ విలక్షణ దర్శకుడు ప్రస్తుతం '2.0' సినిమా రిలీజ్ పనుల్లో బిజీగా వున్నాడు. ఈ సినిమా రిలీజ్ అవగానే, 'భారతీయుడు' సీక్వెల్‌ని పట్టాలెక్కిస్తాడు. కమల్‌హాసన్ హీరోగా నటించనున్న సినిమా ఇది. దీంట్లో మాత్రం ఎలాంటి గ్రాఫిక్స్ వుండబోవట. అయితే ఆ తర్వాతి సినిమాని మాత్రం భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నట్లు శంకర్ చెప్పాడు.
మరోపక్క ఈ సినిమాకి హీరో విక్రమ్ నిర్మాతగా వ్యవహరిస్తాడనీ, విక్రమ్ తనయుడు ధృవ్ హీరోగా నటించబోతున్నాడనీ, సూపర్ హీరో లాంటి కథాంశంతో ఈ సినిమా తెరకెక్కనుందనీ కోలీవుడ్‌లో గుసగుసలు చక్కర్లు కొట్టేస్తున్నాయ్. ధృవ్ ప్రస్తుతం 'అర్జున్‌రెడ్డి' తమిళ రీమేక్‌లో కన్పించనున్న సంగతి తెల్సిందే.
ఈ సినిమా తర్వాత కొంత కాలం గ్యాప్ తీసుకుంటాడట ధృవ్. ఎందుకంటే, సినిమాకి సంబంధించిన పలు అంశాలపై ధృవ్ శిక్షణ తీసుకుంటున్నాడు. తిరిగొచ్చాక, శంకర్ దర్శకత్వంలో ధృవ్ తన తదుపరి సినిమా చేయబోతున్నాడని సమాచారమ్.