'రుద్రాక్ష' క‌ట్ట‌బోతున్న‌ కృష్ణ వంశీ... ఇంత‌కీ ఆ హీరోయిన్ ఎవ‌రు?

By iQlikMovies - June 25, 2019 - 07:30 AM IST

మరిన్ని వార్తలు

 క్రియేటీవ్ డైరెక్ట‌ర్‌గా పేరు తెచ్చుకున్న‌ కృష్ణ‌వంశీకి ఈమ‌ధ్య స‌రైన సినిమాల్లేవు. `చంద‌మామ‌` త‌ర‌వాత ఆయ‌న్నుంచి హిట్టు సినిమా ఏదీ రాలేదు. 'న‌క్ష‌త్రం' అయితే డిజాస్ట‌ర్ అయిపోయింది. రామ్‌చ‌ర‌ణ్ లాంటి హీరోని ప‌ట్టుకున్నా - మ‌ళ్లీ ట్రాక్ ఎక్క‌లేక‌పోయాడు. చాలా రోజుల నుంచి సినిమాల‌కూ, సినిమా వాతావ‌ర‌ణానికీ దూరంగా ఉంటూ వ‌స్తున్నాడు కృష్ణ‌వంశీ. ఇన్నాళ్ల‌కు మ‌ళ్లీ సినిమాల‌పై దృష్టి పెట్టారు. కృష్ణ‌వంశీ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా రూపుదిద్దుకోవ‌డానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి.

 

బండ్ల గ‌ణేష్ ఈ సినిమాని నిర్మించ‌నున్నాడ‌ని టాక్‌. కృష్ణ‌వంశీ రూపొందిన `గోవిందుడు అంద‌రివాడేలే` సినిమాకి బండ్ల‌నే నిర్మాత‌. అందులో డ‌బ్బులు పోగొట్టుకున్నా - కృష్ణ‌వంశీపై న‌మ్మ‌కాలు మాత్రం త‌గ్గ‌లేదేమో. ఇప్పుడు మ‌రో భారీ సినిమా తీయ‌డానికి రంగం సిద్ధం చేస్తున్నాడు. ఇది నాయిక ప్రాధాన్యం ఉన్న క‌థ అనీ, సెప్టెంబ‌రులో ప‌ట్టాలెక్కుతుంద‌ని తెలుస్తోంది. `రుద్రాక్ష‌` అనే టైటిల్ కూడా నిర్ణ‌యించేశార్ట‌. మ‌రి ఇందులో న‌టించే స్టార్ హీరోయిన్ ఎవ‌రో, ఆ కాన్సెప్ట్ ఏమిటో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS