ఈమధ్య టాలీవుడ్ లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు కృతి శెట్టి. `ఉప్పెన` కోసం వైష్ణవ్ తేజ్ తో జత కట్టింది. తనకు అదే తొలి సినిమా. అయితే ఆ సినిమా బయటకు రాకుండానే.. కృతి కి వరుసగా ఆఫర్లు అందుతున్నాయి. తాజాగా..నాని సరసన ఓ సినిమాలో హీరోయిన్ గా ఓకే అయ్యింది. ఇది కాకుండా మరో రెండు సినిమాలు ఆమె చేతిలో ఉన్నాయి. ఆమె ఓకే అనాలే గానీ, మరో అరడజను సినిమాలపై చక చక సంతకాలు పెట్టొచ్చు.
అయితే... కొత్తగా తన దగ్గరకు వస్తున్న నిర్మాతలకు కృతి షాక్ ఇస్తోందని సమాచారం. తొలి సినిమాకి కృతి అక్షరాలా 15 లక్షలు తీసుకుందట. శ్యామ్ సింగరాయ్‌కి 40 లక్షల వరకూ డిమాండ్ చేసిందని సమాచారం. ఇప్పుడు మాత్రం ఏకంగా 75 లక్షలు అడుగుతోందట. ఒక్క సినిమా కూడా బయటకు రాకుండా.. ఇంత డిమాండ్ చేస్తున్న హీరోయిన్ కృతినేనేమో. ఒకవేళ ఉప్పెన సూపర్ హిట్ అయితే.. కృతి కోటి రూపాయలు డిమాండ్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాల్సిందే. కానీ...మరీ ఈ స్థాయిలో పారితోషికం అడిగి.. నిర్మాతల్ని భయపెట్టడం కూడా మంచిది కాదు. పారితోషికం విషయంలో అత్యాశ వదులుకుంటే, ఎక్కువ సినిమాలు చేయొచ్చు. ఇంకాస్త ఎక్కువ కాలం నిలదొక్కుకోవచ్చు. ఈ విషయాన్ని కృతి ఎప్పుడు తెలుసుకుంటుందో..??