`సోగ్గాడే చిన్ని నాయిన`... నాగార్జున కెరీర్లో నే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా ఇది. ఏకంగా 50 కోట్లతో.. రికార్డు సృష్టించింది. ఈ సినిమాకి ప్రీ క్వెల్ గా `బంగార్రాజు` తీయాలన్నది నాగార్జున ఆలోచన. దర్శకుడు కల్యాణ్ కృష్ణ కూడా ఈ స్క్రిప్టు కోసం ఏళ్ల తరబడి తర్జన భర్జనలు పడుతూనే ఉన్నాడు. ఎట్టకేలకు ఈ కథని నాగ్ ఓకే చేశాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ చిత్రంలో నాగచైతన్య సైతం ఓ కీలకమైన పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే, చైతూ సరసన కథానాయికగా ఇప్పుడు కృతి శెట్టిని ఎంచుకున్నారని సమాచారం.
ఉప్పెనతో ఒక్క సినిమాతోనే స్టార్ అయిపోయింది కృతి. ఆసినిమాకి కేవలం ఆరు లక్షల పారితోషికం తీసుకున్న కృతి.. ఆ తరువాతి సినిమాకే ఏకంగా 50 లక్షలు అందుకుంది. ఇప్పుడు తన పారితోషికం కోటి రూపాయలు. అయినా సరే, తన కాల్షీట్లు ఖాళీగా లేవు. తాజాగా కృతి అడిగినంత పారితోషికం ఇచ్చి.. ఈ సినిమాలో తనని ఫైనల్ చేశారని తెలుస్తోంది. నాగార్జున, రమ్యకృష్ణ ఈ సినిమాలో జంటగా కనిపించనున్నారు. పూర్తి వివరాలు త్వరలో తెలుస్తాయి.