ముద్దుగుమ్మలకు స్టార్ హీరోల సరసన నటిస్తే, ఇంకేముంది వారి రేంజ్ పెరిగిపోతుందనడం నిస్సందేహం. కానీ కొందరి విషయంలో అది సందేహమే. అలాంటి వారిలో కృతికర్బంద కూడా ఒకరు.
అక్కినేని హీరో సుమంత్‌తో 'బోనీ' చిత్రంతో తెరంగేట్రం చేసింది. తర్వాత పవర్‌స్టార్‌తో 'తీన్‌మార్' చిత్రంలో నటించింది. కానీ అమ్మడికి ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. రామ్‌తో నటించిన 'ఒంగోలు గిత్త' ఫర్వాలేదనిపించినా, హీరోయిన్‌గా నిలదొక్కుకోవడానికి అది చాలదు. అందుకే స్టార్ ఇమేజ్‌ని అందుకోలేకపోయింది. ప్రస్తుతం తెలుగులో సినిమాలు చేయట్లేదు కానీ, కన్నడలోనూ, హిందీలోనూ పలు చిత్రాల్లో నటిస్తోంది. అప్పుడప్పుడూ వెరీ రేర్‌గా సోషల్ మీడియాలో దర్శనమిస్తూంటుంది. అలా ఇచ్చిన దర్శనాల్లో ఈ హాట్ దర్శనాలను చూసి కుర్రకారు అవాక్కవుతున్నారు.
చూశారుగా పింక్ కలర్ లాంగ్ ఫ్రాక్‌లో సిగ్గులొలుకుతూ ఈ వయ్యారి భామ ఎలా హొయలు పోతోందో. సిగ్గు మాట దేవుడెరుగు. అమ్మడి క్లీవేజ్ పోజుకు చూపు తిప్పుకోవడం కూసింత కష్టమే అవుతోంది మరి.