ప్రజలారా కదలిరండి 'కాలా' వస్తున్నాడు

మరిన్ని వార్తలు

ముంబయ్‌లోని తమిళ ప్రజలను కాపాడే నేపథ్యంలో తెరకెక్కుతోన్న చిత్రం 'కాలా'. తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ హీరోగా, ఆయన అల్లుడు హీరో ధనుష్‌ నిర్మిస్తున్నారు. జూన్‌ 7న 'కాలా' ప్రేక్షకుల ముందుకు రానున్న సందర్భంగా చిత్ర యూనిట్‌ ప్రమోషన్‌ కార్యక్రమాలు వేగవంతం చేసింది. అందులో భాగంగానే తాజాగా 'కాలా' తమిళ ట్రైలర్‌ని విడుదల చేశారు. 

'మన దేహమే ఓ ఆయుధం. ఇది ప్రపంచానికి తెలియాలి. ప్రజలారా కదలిరండి..' అని సూపర్‌స్టార్‌ పిలుపునిచ్చే డైలాగ్‌ అభిమానుల్ని కట్టి పారేస్తోంది. అలాగే తలైవా లవ్‌ ట్రాక్‌ని కూడా ఈ ట్రైలర్‌లో చూపించారు. అన్ని రకాల కమర్షియల్‌ ఎలిమెంట్స్‌తో ఈ సినిమాని తెరకెక్కించారనీ ట్రైలర్‌ చూస్తుంటే తెలుస్తోంది. సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌తో 'కబాలి' చిత్రాన్ని తెరకెక్కించిన పా రంజిత్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 

'కబాలి'తో నిరాశ పరిచిన పా రంజిత్‌, ఈ సినిమాతో ఎలాగైనా హిట్‌ కొట్టాలని భావిస్తున్నాడట. ఆ దృష్టిలోనే రజనీ అభిమానులు మెచ్చే చిత్రంగా ఈ చిత్రాన్ని రూపొందించారట. ముంబయ్‌ మాఫియా బ్యాక్‌ గ్రౌండ్‌లోనే ఈ చిత్రం తెరకెక్కింది. ఇక రజనీకాంత్‌ నుండి సినిమా వస్తుందంటే అది ఓ సెన్సేషనే. 

ఈ సినిమా ట్రైలర్‌ విడుదలైన 15 నిముషాల్లోనే ఏకంగా 18000 లైకులు, 1.3 లక్షల మిలియన్‌ వ్యూస్‌ వచ్చేశాయి. 15 నిముషాలకే పరిస్థితి ఇలా ఉంటే, ఇదో సరకొత్త రికార్డు సృష్టిస్తుందనడం నిస్సందేహం. ట్రైలర్‌కే ఈ రేంజ్‌ రెస్పాన్స్‌ ఉంటే, ఇక సినిమా ఊహాతీతం. చూడాలి మరి రిజల్ట్‌ ఎలా ఉండబోతోందో.
 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS