బాలీవుడ్ బ్యూటీ కృతి కర్బంద తెలుగులో చేసినవి కొన్ని సినిమాలే అయినా కానీ బాగానే పాపులర్ అయ్యింది. పవన్ కళ్యాణ్‌తో 'తీన్‌మార్' సినిమాలో నటించింది. ఆమె వరకూ ఆమె క్యారెక్టర్ ఈ సినిమాలో బాగానే ఎలివేట్ అయినా కానీ, సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేదు. సో ఆ రకంగా పవన్‌తో నటించినా కానీ సక్సెస్‌ని అందుకోలేకపోయింది. తర్వాత మెగా హీరో రామ్ చరణ్‌తో 'బ్రూస్‌లీ' సినిమాలో నటించింది. ఈ సినిమాలో రామ్ చరణ్‌కి అక్కగా ప్రాధాన్యత ఉన్న క్యారెక్టరే చేసింది. దురదృష్టవశాత్తూ ఈ సినిమా కూడా అనుకున్న రిజల్ట్‌నివ్వలేకపోయింది. తర్వాత యంగ్ హీరో రామ్‌తో 'ఒంగోలు గిత్త' సినిమాలో నటించి విజయాన్ని అందుకుంది. బాలీవుడ్ నుండి వచ్చిన ఈ బ్యూటీకి సుమంత్‌తో నటించిన 'బోణీ' తెలుగులో తొలి సినిమా. అయితే తెలుగులో తన అదృష్టానికి ఫలితం దక్కకపోవడంతో, మళ్లీ బాలీవుడ్‌కి చెక్కేసింది. అక్కడ అడపా దడపా సినిమాలు చేస్తోంది. కానీ మలయాళంలో అమ్మడికి మంచి మంచి ఆఫర్స్ వస్తున్నాయి. వరుస ఆఫర్స్‌తో మలయాళంలో ఫుల్ బిజీగా ఉంది ఈ బ్యూటీ. ఆ రకంగా తెలుగు ప్రేక్షకుల నుండి అంతగా దక్కని ఆదరణ ఆమెకు కన్నడ ప్రేక్షకుల నుండి లభించింది. సో అక్కడే సెటిలైపోవాలనుకుంటోందట. ఇప్పుడిప్పుడే కన్నడ భాషని అర్ధం చేసుకుంటోంది. మెల్ల మెల్లగా ఆ భాషని నేర్చుకోవడానికీ ప్రయత్నిస్తోందట ఈ బ్యూటీ. ఎలాగూ బాలీవుడ్‌లోనూ సినిమాలు చేస్తోంది. అయితే కన్నడలో పాపులర్ నటి అనిపించుకుంటోంది. బాలీవుడ్‌లో కృతికర్భంద నటించిన 'షాదీ మే జరూర్ ఆనా' చిత్రం ఈ నెల 10న విడుదలకు సిద్ధంగా ఉంది.