గత రెండు రోజులుగా ప్రభాస్, కృతి సనన్ ల ప్రేమ వార్తలే. ‘భేదియా’ ప్రమోషన్స్‌లో భాగంగా వరుణ్ ధావన్, కృతిసనన్ ఓ షోలో పాల్గొన్నారు. పాన్ ఇండియా స్టార్ హీరో కృతితో ప్రేమలో ఉన్నారంటూ ఆ షోలో వరుణ్ కామెంట్స్ చేశాడు. ‘‘కృతిసనన్ పేరు మరొకరి మనసులో వుంది. ఆ వ్యక్తి ప్రస్తుతం ముంబయిలో లేడు. వేరే ప్రాంతంలో దీపికా పదుకొణెతో కలిసి షూట్‌లో ఉన్నాడు’’ అంటూ వరుణ్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. దీంతో ప్రభాస్ , కృతి ప్రేమలో ఉన్నారంటూ వార్తలు పుట్టించేశారు.
అయితే ఎట్టకేలకు కృతి తాను ఎవరి ప్రేమలో లేనని స్పష్టం చేసింది."ఇది ప్రేమ కాదు, అలా అని ప్రచారం కోసం చేసిందీ కాదు. వరుణ్ ఓ రియాలిటీ షోలో కాస్త వైల్డ్ గా ప్రవర్తించాడు. అతడి మాటలు గాసిప్స్ కి దారితీశాయి. కొన్ని వెబ్‌సైట్లు నా వివాహ తేదీనీ ప్రకటించడానికి ముందే వీటికి నేను ఫుల్‌స్టాప్ పెడుతున్నా. వాటిల్లో ఎలాంటి నిజం లేదు’’ అని ఆమె క్లారిటీ ఇచ్చింది.