'1 - నేనొక్కడినే' సినిమాతో తెరంగేట్రం చేసి, తర్వాత 'దోచేయ్' తదితర చిత్రాల్లో నటించిన ముద్దుగుమ్మ కృతి సనన్. తెలుగులో డెబ్యూ 'సూపర్'గా ఉన్నప్పటికీ, స్టార్‌డమ్ దక్కించుకోలేకపోయింది. దాంతో ఎక్కడి నుండి వచ్చిందో అక్కడికే దుకాణం కట్టేసింది. బాలీవుడ్‌లోనే అవకాశాలు వెతుక్కుంది. ఒకటీ అరా సినిమాలు చేసింది. చేస్తూనే ఉంది. తాజాగా 'మిమి' అనే సినిమాలో ఈ పొడుగు కాళ్ల సుందరి ఛాన్స్ దక్కించుకుంది. సరోగసీ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. తాజాగా ఫిల్మ్ ఫేర్ కోసం ఓ స్పెషల్ ఫోటో సెషన్ చేయించుకుంది.
అందులోంచి, సోఫాలో స్టైల్‌గా కూర్చొన ఈ ఫోటో నెట్టింట్లో వైరల్ అవుతోంది. లాంగ్ వ్యూ నుండి క్యాప్చర్ చేసిన ఈ ఫోటోలో రెండు చేతులూ దగ్గరకి కట్టుకుని, బూడిద రంగు మోడ్రన్ షార్ట్ వేర్‌లో కృతిసనన్ స్టైలిష్‌గా కనిపిస్తోంది. ఈ సుందరాంగికి గ్లామర్ అస్త్రాలైన పొడుగు కాళ్లను ఎక్స్‌పోజ్ చేస్తూ వయ్యారాలు పోతోంది. ఇంకెందుకాలస్యం స్టైలిష్ అండ్ సింప్లీ లుక్‌లో మెరిసిపోతున్న కృతిసనన్‌పై ఓ షార్ప్ లుక్కేస్కోండి మరి.