విశాల్, సమంత జంటగా తెరకెక్కిన 'అభిమన్యుడు' (తమిళంలో 'ఇరుంబుతిరై') చిత్రం మంచి విజయం అందుకుంది. పెరిగిన సాంకేతిక పరిజ్ఞానంతో ఎలాంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందనే కాన్సెప్ట్‌ని బేస్ చేసుకుని ఈ సినిమాని తెరకెక్కించారు. సీనియర్ నటుడు విలన్‌గా అర్జున్ కీలక పాత్ర పోషించారు. ఇప్పుడీ సినిమాకి సీక్వెల్ రూపొందించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
ఈ సినిమాతో డైరెక్టర్‌గా పరిచయమైన పి.యస్. మిత్రన్ ఈ సీక్వెల్‌కీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే 'అయోగ్య' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చొన విశాల్, ప్రస్తుతం 'యాక్షన్' సినిమాలో నటిస్తున్నాడు. తమన్నా ఈ సినిమాలో విశాల్‌కి జోడీగా నటిస్తోంది. సైనిక అధికారిగా విశాల్ కనిపించనున్నాడు ఈ సినిమాలో. నిర్మాణం చివరి దశకు చేరుకున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. తదుపరి 'అభిమన్యుడు 2' కోసం విశాల్ సిద్ధం కానున్నాడట.
అయితే, డైరెక్టర్ పి.ఎస్, మిత్రన్ ప్రస్తుతం శివ కార్తికేయన్‌తో 'హీరో' చిత్రం రూపొందిస్తున్నాడు. ఈ సినిమా పూర్తి కాగానే, విశాల్ సినిమాపై ఫోకస్ పెట్టనున్నాడట. 'అభిమన్యుడు 2' లో ఇద్దరు ముద్దుగుమ్మలు విశాల్‌తో జోడీ కట్టనున్నారని తాజాగా కోలీవుడ్ వర్గాల సమాచారం. రెజీనా, శ్రద్ధా శ్రీనాధ్‌ల పేర్లు ఆ లిస్టులో వినిపిస్తున్నాయి. త్వరలోనే ఈ విషయమై క్లారిటీ రానుంది.