కృతి-సుశాంత్ ల పెళ్ళి పుకార్లు

By iQlikMovies - May 08, 2018 - 11:39 AM IST

మరిన్ని వార్తలు

బాలీవుడ్ లో గత రెండు మూడు రోజుల నుండి ఎక్కడ విన్నా చూసిన వినిపించే కనిపించే విషయం- సోనమ్ కపూర్ పెళ్ళి. ఈ పెళ్ళికి సంబంధించి ఇప్పటికే బాలీవుడ్ తారాలోకం మొత్తం సోనమ్ కపూర్ పెళ్ళికి సంబందించిన కార్యక్రమాలలో మనకి దర్శనమిస్తున్నారు.

 

ఇదిలావుండగానే ఒక బాలీవుడ్ కుర్ర జంట మీడియా దృష్టిని తమవైపుకి తిప్పుకుంటున్నది. ఆ వివరాల్లోకి వెళితే,  హీరో సుశాంత్ సింగ్, హీరోయిన్ కృతి సనన్ ల మధ్య ప్రేమ చిగురించింది అని గత కొంతకాలంగా బాలీవుడ్ మీడియా మొత్తం ప్రకటించడంతో పాటుగా వారిని నేరుగా కూడా పలుసార్లు ఈ విషయమై ప్రశ్నల వర్షం కూడా కురిపించారు.

అయితే ఈ ఇరువురు మాత్రం ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. కాని ఇప్పుడు వీరిరువురు ఈ సంవత్సరం పెళ్ళి చేసుకోనున్నారు అంటూ వార్తలు రావడం మొదలయింది. దీనికి సాక్ష్యంగా ఈ ఇరువురి కుటుంబాలు ఒకరిని ఒకరు కలుసుకున్నాయి అని చెబుతూ వాటికి సంబంధించి ఫోటోలు కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.

అయితే ఇంకా ఈ వార్తల పైన ఇటు సుశాంత్ కాని అటు కృతి స్పందించలేదు. ఇంతకి ఈ పుకారు నిజంగా మారే ఆస్కారం ఎంతవరకు అనేది కాలమే చెప్పాలి.  

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS