మళ్ళీ మొదలైన ఆర్జీవీ-పవన్ ఫ్యాన్స్ రచ్చ

మరిన్ని వార్తలు

ఈ మధ్యకాలంలో ఆర్జీవీ చేసిన సినిమాల ద్వారా కాకుండా తాను చేసిన వివాదస్పద పనుల వల్లే ఎక్కువగా వార్తల్లో వ్యక్తిగా నిలిచాడు. తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పైన ఆయన శ్రీ రెడ్డి తో అనిపించిన ఒక అసభ్య పదం మొత్తం ఇండస్ట్రీని ఉలిక్కిపడేలా చేసింది.

అయితే గత రెండు వారాల నుండి ఆయన నుండి ఎటువంటి మాటలు లేవు. అయితే నిన్నటి రోజున ఆయన మరోసారి పవన్ కళ్యాణ్ అభిమానుల పైన పరోక్షంగా పెట్టిన ట్వీట్ ఇప్పుడు మళ్ళీ ఒక కొత్త వివాదాన్ని తెర తీసినట్టుగా అయింది.

ఇంతకి ఆయన అన్నది ఎంటి అంటే- నా ఆఫీసర్ టీజర్ కి కేవలం 11 వేల డిజ్ లైక్స్ వచ్చాయి అంటే పవన్ ఫ్యాన్స్ సంఖ్య కేవలం 11 వేలమందేనా.. దేనికి వెంటనే పవన్ ఫ్యాన్స్ నుండి కౌంటర్లు మొదలయ్యాయి. ఆ ట్వీట్ కౌంటర్లని కూడా రామ్ గోపాల్ వర్మ రీ-ట్వీట్ చేస్తుండడం కొసమెరుపు.

ఈ మొత్తం ఎపిసోడ్ లో ఆర్జీవీ తన సినిమాని ప్రమోట్ చేసుకుంటున్నాడు అని అందుకోసమే మనల్ని వాడుకుంటున్నాడు, ఆ ట్రాప్ లో మనం పడకూడదు అని ఇంకొందరు పవన్ ఫ్యాన్స్ తోటివారికి సలహాలు ఇస్తున్నారు.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS