కరోనా మహమ్మారి ఎవరినీ వదలిపెట్టడం లేదు. అందరికీ చుక్కలు చూపిస్తోంది. సెలబ్రెటీలూ అందుకు అతీతులు కారు. పైగా షూటింగుల హడావుడిలో ఉంటారు కదా..? నిత్యం వందల మందితో పనిచేయాల్సిన పరిస్థితి.కాబట్టి కరోనాకి ఈజీగా దొరికేస్తుంటారు. తాజాగా మహేష్ హీరోయిన్ కూడా కరోనా బారీన పడిందని టాక్.
మహేష్ తో `నేనొక్కడినే`లో నటించిన కృతి సనన్ కి కరోనా పాజిటీవ్ అని తేలింది. ఇటీవల ఆమె బాలీవుడ్ హీరో రాజ్ కుమార్ రావుతో ఓ సినిమాలో నటిస్తోంది. ఛండీఘర్ లో షూటింగ్ జరుగుతోంది. ఇటీవలత చండీఘర్ వెళ్లొచ్చింది కృతి. ముంబై వచ్చాక కొన్ని ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కుంటున్నట్టు తేలింది. ఆ వెంటనే కోవిడ్ పరీక్షలు చేయించుకుంటే పాజిటీవ్ గా నిర్దారణ అయ్యిందని సమాచారం. ప్రస్తుతం ఆమె హోం క్వారెంటైన్ లో చికిత్స పొందుతోందని తెలుస్తోంది. అయితే.. కృతికి కరోనా సోకిన విషయం ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు.